News April 4, 2025

విద్యుత్ సమస్యలపై నెల్లూరు కలెక్టరుకు ఫిర్యాదు

image

దుత్తలూరు మండలం నందిపాడు, వెంకటంపేట గ్రామాల్లో గురువారం కలెక్టర్ ఓ.ఆనంద్ ఎదుట ప్రజలు విద్యుత్ సమస్యలపై ఏకరువు పెట్టారు. లోవోల్టేజీ సమస్య తీవ్రంగా ఉందని, శిథిల స్తంభాలు గాలులకు నేలకొరిగి ఎప్పుడు ఏలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. 

Similar News

News April 11, 2025

నెల్లూరు: 50 మందికి 11.40 కోట్ల రుణాలు

image

నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన భవన్‌లో ఫూలే జయంతి శుక్రవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ పూలదండలు వేసి నివాళులర్పించారు. 50 మంది బీసీలకు మంజూరైన రూ.11.4కోట్ల రుణాల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News April 11, 2025

నెల్లూరు జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

నెల్లూరు జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 53,200 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 28,176 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 25,024 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది. దీంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 11, 2025

నెల్లూరు: బ్యాంక్ ఉద్యోగం పేరిట మోసం

image

నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్‌కు చెందిన శ్రీదేవి గతంలో ఓ గోల్డ్‌లోన్ సంస్థలో పనిచేశారు. కలువాయి(M) చవటపల్లికి చెందిన రమ్య లోన్‌కు వెళ్లి శ్రీదేవిని పరిచయం చేసుకుంది. డబ్బులు కట్టడంతో తనకు HYDలో SBI బ్రాంచ్ మేనేజర్ పోస్ట్ వచ్చిందని రమ్య నమ్మించడంతో శ్రీదేవి ఉద్యోగానికి రూ.9లక్షలు ఇచ్చింది. ఉద్యోగాలు తీసిచ్చే అతను చనిపోయాడంటూ రమ్య తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

error: Content is protected !!