News April 4, 2025
గీసుకొండ: బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ శిక్ష

బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి వరంగల్ ఫస్ట్ అడిషనల్ జిల్లా స్పెషల్ కోర్ట్ జడ్జి ప్రేమలత యావజ్జీవ శిక్ష విధించారు. 2024లో గీసుకొండ మండలం మనుగొండ గ్రామానికి చెందిన చాపర్తి సాంబయ్య ఓ బాలికపై అత్యాచారం చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చగా గురువారం కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది.
Similar News
News April 11, 2025
రోజంతా నగ్నంగా పాప్ సింగర్

హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ బీచ్‌లో రోజంతా నగ్నంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాలో తెలియజేశారు. ఎండవేడికి ఆమె చర్మం ప్రభావితమైనట్లు ఫొటోలో తెలుస్తోంది. కాగా గత ఏడాది స్వీయ వివాహం చేసుకొని ఈ బ్యూటీ వార్తల్లో నిలిచారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న బ్రిట్నీ ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు.
News April 11, 2025
కర్నూలు విద్యాశాఖ ఏడీపై సస్పెన్షన్ వేటు

కర్నూలు విద్యాశాఖ అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులుపై సస్పెన్షన్ వేటు పడింది. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తన్నాడని ఇటీవల ఆయనపై పలు ఫిర్యాదులు వచ్చాయి. విచారణ చేపట్టిన కడప ఆర్జేడీ నివేదికను ఉన్నతాధికారులకు పంపారు. దీంతో తాజాగా ఆయనను సస్పెండ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు.
News April 11, 2025
HYD: రూట్ మ్యాప్ విడుదల

రేపు శ్రీ వీర్ హనుమాన్ విజయయాత్ర జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు రూట్ మ్యాప్ విడుదల చేశారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్‌బండ్ హనుమాన్ మందిర్ వరకు 12 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుందని స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ర్యాలీ ఉంటుంది. యాత్ర మార్గాల్లో ట్రాఫిక్ రద్దీకి అవకాశముండటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని ట్రాఫిక్ అధికారులు విజ్ఞప్తి చేశారు.