News April 4, 2025

పెండింగ్ పనులు పూర్తి చేయాలి: జనగాం కలెక్టర్

image

ఏప్రిల్ 12లోగా పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో UDID కార్డులు, శాశ్వత మరణాల ఆసరా పెన్షన్ ధృవీకరణ, SHG బీమా, ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ఉపాధి పనులు, LRS విషయాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆయనతో పాటు అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్ ఉన్నారు.

Similar News

News January 11, 2026

రేపు PSLV-C62 ప్రయోగం

image

AP: ISRO మరో చారిత్రక ప్రయోగానికి సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌-షార్‌ నుంచి రేపు ఉదయం 10.17 గంటలకు PSLV-C62 రాకెట్‌ను ప్రయోగించనుంది. దీని ద్వారా అధునాతన భూపరిశీలన ఉపగ్రహం EOS-N1తో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను రోదసిలోకి పంపనుంది. కొత్త ఏడాదిలో ISROకు ఇదే తొలి ప్రయోగం. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ఈరోజు మధ్యాహ్నం 12.17 గంటలకు ప్రారంభించనున్నారు.

News January 11, 2026

కామారెడ్డి: పేకాట శిబిరంపై దాడి.. ఐదుగురి అరెస్టు

image

రామారెడ్డి మండలం ఉప్పల్వాయిలో పేకాట స్థావరంపై పోలీసులు శనివారం దాడి నిర్వహించారు. గ్రామంలోని ఓ ఇంట్లో పేకాట నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టామని ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.21,930 నగదు, 5 మొబైల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

News January 11, 2026

బంగారం ధర రూ.2 లక్షలకు చేరనుందా?

image

2025లో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు 2026లోనూ అదే పంథా కొనసాగించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,500 డాలర్లు ఉంది. ఇది మార్చి నాటికి 5,000 డాలర్లకు చేరే అవకాశాలు ఉన్నట్లు HSBC కమోడిటీ పేర్కొంది. ఇక దేశీయంగా 10  గ్రాముల బంగారం ధర ఇప్పటికే రూ.1.41 లక్షల వద్ద ఉండగా, జూన్‌ నాటికి రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.