News April 4, 2025
నారాయణపేట జిల్లా రైతులకు కలెక్టర్ ముఖ్య గమనిక

రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వరి ధాన్యం (సన్న రకం) కొనుగోలుకు సంబంధించి క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. అయితే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు తప్పని సరిగా పాటించాలని అన్నారు. గురువారం నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాలపై అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు.
Similar News
News September 19, 2025
బ్రెజిల్‌లో మహిళా వర్సిటీ అధ్యాపకురాలికి పతకం

బ్రెజిల్‌లో ఈ నెల 16వ తేదీ జరిగిన బ్రిక్స్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంపిటేషన్‌లో మహిళా వర్సిటీ అధ్యాపకురాలు రమాజ్యోతి కాంస్య పతకం పొందారు. ‘బయోడిగ్రేడబుల్ ఫుడ్ ప్యాకేజింగ్ ఉత్పత్తులు’ ఇన్నోవేషన్‌ను ఆమె వర్చువల్ విధానంలో ప్రదర్శించారు. ఈ ఆవిష్కరణకు కాంస్య పతకం లభించింది. VC ఉమ మాట్లాడుతూ.. పట్టణ ప్రగతికి అనుగుణమైన పరిష్కారాలను తీసుకువచ్చే గొప్ప గుర్తింపు అని కొనియాడారు.
News September 19, 2025
కార్ల ధరలు తగ్గించిన మారుతి సుజుకీ

కొత్త GST రేట్ల నేపథ్యంలో మారుతి సుజుకి కార్ల ధరలను తగ్గించింది. S-ప్రెసోపై రూ.1,29,600, ఆల్టో K10పై రూ.1,07,600, సెలేరియోపై రూ.94,100, డిజైర్‌పై రూ.87,700, వ్యాగన్-Rపై రూ.79,600, ఇగ్నిస్‌పై రూ.71,300, స్విఫ్ట్‌పై రూ.84,600, బాలెనోపై రూ.86,100, ఫ్రాంక్స్‌పై రూ.1,12,600, బ్రెజ్జాపై రూ.1,12,700, గ్రాండ్ విటారాపై రూ.1,07,000, జిమ్నీపై రూ.51,900, ఎర్టిగాపై రూ.46,400 మేర ధరలు తగ్గించింది.
News September 19, 2025
వైసీపీ కూటమి ప్రభుత్వానికి అప్పులు అప్పగించింది: పుల్లారావు

గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ప్రతి పథకానికి తన బొమ్మ వేసుకోవాలనుకున్నారని, అందుకే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నిలిచిపోయిందని MLA ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కూటమి ప్రభుత్వంలో దేశంలో అమలు కాని పథకాలన్నీ అమలవుతాయన్నారు. గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి అప్పులు అప్పగించిందని ఆయన విమర్శించారు. చిలకలూరిపేటలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.