News April 4, 2025

జనగామ మార్కెట్ యార్డ్ 3 రోజులు బంద్

image

జనగామలోని మార్కెట్ యార్డుకు 3 రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్మన్ శివరాజ్ యాదవ్ తెలిపారు. భారీ మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తులు వచ్చిన కారణంగా యార్డ్‌లో స్థలం లేదన్నారు. దీంతో శుక్రవారం సెలవు ప్రకటించారు. శనివారం జగ్జీవన్ జయంతి, ఆదివారంతో కలిపి మొత్తం 3 రోజులు మార్కెట్‌లో క్రయవిక్రయాలు జరగవని పేర్కొన్నారు. సోమవారం తిరిగి పున:ప్రారంభం ప్రారంభమవుతుందని, రైతులు సహకరించాలని కోరారు.

Similar News

News April 11, 2025

రేపే రిజల్ట్.. అనంతపురం జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ!

image

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. అనంతపురం జిల్లాలో ఫస్టియర్ 25,730 మంది, సెకండియర్ 22,960 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 11, 2025

HYD: ప్రభుత్వానికి 3D మంత్ర: KTR

image

కాంగ్రెస్ ప్రభుత్వం 3D మంత్ర అమలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. డిస్ట్రక్షన్, డిమాల్షన్, డైవర్షన్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని, 400 ఎకరాలు అటవీ భూమే అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఆ 400 ఎకరాలు అటవీ భూమి అని చెబుతున్నానన్నారు.

News April 11, 2025

‘ఆస్కార్’కు రాజమౌళి ధన్యవాదాలు

image

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో స్టంట్ డిజైన్‌ కేటగిరీని చేర్చడంపై డైరెక్టర్ రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. ‘ఎట్టకేలకు వందేళ్ల నిరీక్షణ తర్వాత. 2027లో విడుదలయ్యే చిత్రాలకు ఆస్కార్ డిజైన్ కేటగిరీని చేర్చడం సంతోషం. దీనిని సాధ్యం చేసినందుకు డేవిడ్ లీచ్, క్రిస్ ఓ హారా & స్టంట్ కమ్యూనిటీకి, అకాడమీ సీఈవో బిల్ క్రామెర్‌కు ధన్యవాదాలు. ఈ ప్రకనటలో RRR యాక్షన్ విజువల్ వాడటం చూసి ఆనందించా’ అని తెలిపారు.

error: Content is protected !!