News April 4, 2025
మహబూబ్‌నగర్: హోటళ్లలో అధికారుల తనిఖీలు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లను ఫుడ్ సేఫ్టీ అధికారి మనోజ్ అధికారంలో తనిఖీలు నిర్వహించారు. పలు హోటళ్ల నుంచి బిర్యానీ శాంపిల్స్ సేకరించి లాబొరేటరీకి పంపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాంపిల్స్‌లో ఏమైనా కల్తీ నిర్ధారణ జరిగితే సదరు హోటళ్లపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
Similar News
News April 11, 2025
నారాయణపేట: Way2Newsలో వార్త.. ఆ ఊరికి బ్రిడ్జి..!

నారాయణపేట జిల్లా మరికల్‌లో నాయీ బ్రాహ్మణ శ్మశాన వాటికకు నిత్యం వాగులో నుంచి నడుచుకుంటూ అంత్యక్రియలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఘటనపై బుధవారం Way2Newsలో <<16039649>>‘అంతిమయాత్రకు తప్పని తిప్పలు’<<>> అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి వెంటనే వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆదేశించారు. శుక్రవారం సంబంధిత అధికారులు వంతెన నిర్మించేందుకు కొలతలను తీసుకెళ్లారు.
News April 11, 2025
గద్వాల: పెళ్లి వేడుకలో ఘర్షణ

గద్వాల పట్టణంలోని గజ్జెలమ్మ వీధి గోకరమయ్య కట్ట వద్ద రాత్రి పెళ్లి వేడుకలో డీజే పాటల కోసం 2 వర్గాలు కట్టెలు, రాళ్లతో దాడి చేసుకున్నాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని చెప్పారు. పది మందిని అదుపులోకి తీసుకుని, మరికొందరిపై కేసులు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ తెలిపారు.
News April 11, 2025
నాగర్‌కర్నూల్: సళేశ్వరానికి వచ్చే భక్తుల ఆరోగ్యంపై హెచ్చరిక

సళేశ్వరం లింగమయ్య జాతర నేటి నుంచి 13 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. అధికారులు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు. రాకపోకలు, మెడికల్ సదుపాయాలు, శుద్ధి చర్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు సూచిస్తూ, గుండె సంబంధిత సమస్యలున్న భక్తులు శరీరాన్ని ఒత్తిడికి గురిచేయకుండా విశ్రాంతిగా యాత్ర చేయాలని సూచిస్తున్నారు. అధిక రద్దీ సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు.