News April 4, 2025

నిర్మల్: ‘తెలుగు స్క్రైబ్‌ రిపోర్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు’

image

తప్పుడు వార్త కథనం ప్రచురించిన వ్యక్తిపై, ఆ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్మల్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి గురువారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలుగు స్క్రైబ్ అనే పేరుతో ‘చెరువులను కబ్జా పెడుతున్న ముఖ్యమంత్రి అనుచరుడు’ అని తన పరువుకు భంగం కలిగించే కథనాన్ని ప్రచురించాడని పేర్కొన్నారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Similar News

News April 11, 2025

HYDలో రూట్ మ్యాప్ విడుదల

image

రేపు శ్రీ వీర్ హనుమాన్ విజయయాత్ర జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు రూట్ మ్యాప్‌ విడుదల చేశారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్‌బండ్ హనుమాన్ మందిర్ వరకు 12 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుందని స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ర్యాలీ ఉంటుంది. యాత్ర మార్గాల్లో ట్రాఫిక్ రద్దీకి అవకాశముండటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని ట్రాఫిక్ అధికారులు విజ్ఞప్తి చేశారు. 

News April 11, 2025

విశాఖ-కిరండూల్ పాసింజర్ అరకు వరకే

image

విశాఖ-కిరండూల్-విశాఖ పాసింజర్ అరకు వరకే నడుస్తాయని వాల్తేర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. కేకే లైన్‌లోని పాడువ – దార్లిపుట్ మధ్య డబ్లింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో‌ విశాఖ-కిరండూల్ పాసింజర్ (58501) రైలు ఏప్రిల్ 14 నుంచి 22 వరకు విశాఖ నుంచి అరకు వరకే నడుస్తుందని తెలిపారు. తిరుగు ప్రయాణం కిరండూల్-విశాఖ పాసింజర్ (58502) రైలు ఈ నెల 14 నుంచి 22 వరకు అరకు నుంచి విశాఖ వెళ్తుందన్నారు.

News April 11, 2025

జైలులో CBN చేసినవి డ్రామాలు: పేర్ని నాని

image

AP: భద్రత విషయంలో వైసీపీ చీఫ్ జగన్‌కు డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. డ్రామాలంటే జైలులో ఉన్నప్పుడు చంద్రబాబు చేసినవని కౌంటరిచ్చారు. వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే జగన్‌పై విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. భద్రత కల్పించడంలో విఫలమైన కూటమి నేతలు దిగజారిపోయి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సినీ ప్రముఖుల కంటే ఎక్కువ క్రేజ్ జగన్ సొంతమని చెప్పారు.

error: Content is protected !!