News April 4, 2025
ఏప్రిల్ 4: చరిత్రలో ఈరోజు

1976: నటి సిమ్రాన్ జననం
1841: అమెరికా మాజీ అధ్యక్షుడు విలియం హెన్రీ హారిసన్ మరణం
1942: తెలుగు రచయిత్రి చల్లా సత్యవాణి జననం
1968: పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ మరణం
1975: మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించిన రోజు
గనుల అవగాహన దినోత్సవం
Similar News
News April 15, 2025
మళ్లీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ సినిమా

సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ‘భరత్ అనే నేను’ మరోసారి థియేటర్లలో విడుదలవుతోంది. ఈనెల 26న ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. సిినిమా వచ్చి ఏడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అడ్వాన్స్ బుకింగ్స్ త్వరలో ప్రారంభం అవుతాయని తెలిపారు. ఈ చిత్రం 2018లో విడుదలై రూ.200+ కోట్లు వసూలు చేసింది.
News April 15, 2025
OTD: సంచలనానికి ఏడాది

గత ఏడాది ఐపీఎల్‌లో SRH బ్యాటింగ్‌లో ఊచకోతతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది. 2024 ఏప్రిల్ 15(సరిగ్గా ఇదే రోజు)న టోర్నీ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. RCBతో జరిగిన మ్యాచులో 20 ఓవర్లలో 287 పరుగులు చేసింది. హెడ్ శతకం, క్లాసెన్ హిట్టింగ్‌తో భారీ స్కోరు చేసి చరిత్ర సృష్టించింది. ఈ ఏడాదీ SRH 286 పరుగులు చేసినా గత రికార్డును చెరపలేకపోయింది. మరి ఈ సీజన్‌లో కొత్త రికార్డు నమోదవుతుందా? కామెంట్.
News April 15, 2025
బోయింగ్‌కు ‘బాత్రూమ్’ చిక్కులు.. 3.4 మిలియన్ డాలర్ల ఖర్చు

బోయింగ్ విమానంలో బాత్రూమ్ డోర్ లాక్ కావడంతో ఓ ప్రయాణికుడు అందులోనే చిక్కుకుపోయాడు. సిబ్బంది ఎంత ప్రయత్నించినా తలుపు రాకపోవడంతో విమానాన్ని అత్యవసరంగా కిందికి దించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన US విమానయాన పర్యవేక్షణ సంస్థ FAA, బోయింగ్‌కు చెందిన 2612 విమానాల ప్రయాణ అర్హతను ప్రశ్నించింది. బోయింగ్ అన్ని విమానాల్లోని లాక్‌లను మార్చాల్సి ఉండటంతో దీనికి 3.4 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా.