News April 4, 2025
SKZR: ఇద్దరి బైండోవర్.. రూ.2లక్షల జరిమానా

కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన యెనాం రాజు దేశీదారు అమ్ముతూ, ఈస్గం గ్రామానికి చెందిన సాయిరి రమేష్ బెల్లం రవాణ చేస్తూ పట్టుబడ్డారు. వారిపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేసి కాగజ్‌నగర్ తహశీల్దార్ వద్ద బైండోవర్ చేశారు. కానీ మళ్లీ వారు దేశీదారు, బెల్లము అమ్ముతూ పట్టుబడగా కాగజ్‌నగర్ తహశీల్దార్ కిరణ్ ఆ ఇద్దరికీ రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు ఎక్సైజ్ సీఐ రవికుమార్ తెలిపారు.
Similar News
News September 17, 2025
హీరోయిన్ ఇంటిపై కాల్పులు.. నిందితుల ఎన్‌కౌంటర్

హీరోయిన్ దిశా పటానీ <<17692512>>ఇంటిపై<<>> కాల్పుల కేసులో నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించారు. UPలోని ఘజియాబాద్‌లో వారిని పట్టుకునే క్రమంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నిందితులు అరుణ్, రవీంద్ర మరణించారని పోలీసులు తెలిపారు. నిందితులు గోల్డీ బ్రార్ గ్యాంగ్ సభ్యులని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని అగౌరవపరిచినందుకు హీరోయిన్ ఇంటిపై కాల్పులు జరిపినట్లు వారు వెల్లడించిన సంగతి తెలిసిందే.
News September 17, 2025
GVMC జోన్-3 పరిధిలో 26న బహిరంగ వేలం

GVMC జోన్- 3 పరిధిలో దుకాణాలు, కళ్యాణ మండపాలు, రోడ్ సైడ్ మార్కెట్లకు సెప్టెంబర్ 26న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జోనల్ కమిషనర్ కె.శివప్రసాద్ బుధవారం తెలిపారు. జోన్ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్, కళ్యాణ మండపాలు, పలు వార్డుల్లో వ్యాపార సముదాయాలను వేలం వేస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు GVMC జోన్-3 జోనల్ ఆఫీసు వద్ద ఆరోజు ఉదయం 11 గంటలకు హాజరుకావాలన్నారు.
News September 17, 2025
యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు

TG: రాష్ట్రంలో <<17740234>>ఆరోగ్యశ్రీ<<>> సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. 87 శాతం హాస్పిటళ్లు పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తుండగా, కేవలం 13 శాతం హాస్పిటళ్లలోనే సేవలు ఆగాయని పేర్కొన్నారు. వైద్య సేవలు కొనసాగించాలని ఆరోగ్యశ్రీ CEO ఉదయ్ కుమార్ మరోసారి ఆయా ఆస్పత్రులకు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద గత 2 వారాలుగా సగటున రోజుకు 844 సర్జరీలు నమోదవగా ఈరోజు 799 సర్జరీలు నమోదయ్యాయని వెల్లడించారు.