News April 4, 2025
ట్రాక్టర్‌లకు జీపీఎస్ ఖచ్చితంగా ఉండాలి: జనగాం కలెక్టర్

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక తరలింపులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ట్రాక్టర్‌లకు జీపీఎస్ ఖచ్చితంగా ఉండాలని ఆదేశించారు. ఏ గ్రామానికి ఇసుకను తరలిస్తున్నారో ఆ రాకపోకలకు సంబంధించి గ్రామ పంచాయతీ కార్యాలయంలోని రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.
Similar News
News September 14, 2025
బాపట్ల జిల్లా SP నేపథ్యం ఇదే.!

బాపట్ల జిల్లా SPగా ఉమామహేశ్వర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమామహేశ్వర్ ప్రస్తుతం సీఐడీ విభాగంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో గురజాల, కడప, ఆదిలాబాద్ జిల్లాలో DSPగా పని చేశారు. అనంతరం ASPగా పదోన్నతి పొంది అదిలాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో బాధ్యతలు స్వీకరించారు. ఇంటెలిజెన్స్, విజిలెన్స్, సీఐడీ విభాగాలలో కూడా విధులు నిర్వహించారు.
News September 14, 2025
17న జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు

ఈనెల 17న రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు జిల్లా బంద్ చేపడతామని కార్మిక సంఘ నాయకులు తెలిపారు. శనివారం చీపురుపల్లిలో బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఫ్రీ బస్సుతో రోడ్డున పడ్డ ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ.25 వేలు ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీవో వేధింపులు, ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్లను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గరివిడి, చీపురుపల్లి, మెరకముడిదం, రాజాం డ్రైవర్లు పాల్గొన్నారు.
News September 14, 2025
గండికోటకు అవార్డు

న్యూఢిల్లీలో ఈ నెల 11 నుంచి 13 వరకు జరిగిన బిజినెస్ లేజర్ ట్రావెల్ అండ్ మైస్ ఎగ్జిబిషన్ (BLTM 2025)లో గండికోటకు ‘మోస్ట్ ప్రామిసింగ్ న్యూ డెస్టినేషన్ అవార్డు’ లభించింది. ‘భారతదేశపు గ్రాండ్ కేనియన్’గా ప్రసిద్ధి చెందిన గండికోటకు ICRT, భారత ప్రభుత్వం పర్యాటక మంత్రిత్వ శాఖ మద్దతుతో నిర్వహించిన రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డ్స్‌లో ఈ అవార్డు లభించింది.