News April 4, 2025
కొడంగల్: ‘ఆస్తిపన్ను వసూళ్లలో రికార్డు’

ఆస్తిపన్ను వసూళ్లలో కొడంగల్ మున్సిపాలిటీ రికార్డు సాధించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను 82.88 శాతం పన్ను వసూలు చేసినట్లు కమిషనర్ బలరాం నాయక్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ టి కె. శ్రీదేవి చేతులమీదగా కమిషనర్ బలరాం నాయక్ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.
Similar News
News April 14, 2025
కృష్ణా: రేపు స్పందన కార్యక్రమం రద్దు- కలెక్టర్

ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని ఈ సోమవారం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బీ ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. అర్జీలు ఇచ్చేందుకు వచ్చే వారు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.
News April 14, 2025
రేపు బావోజీ జాతరకు రానున్న ఎమ్మెల్సీ, మాజీ మంత్రి

కొడంగల్ నియోజకవర్గంలోని భూనీడ్‌లో సోమవారం జరిగే అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పాల్గొంటారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. అనంతరం తిమ్మిరెడ్డిపల్లిలో జరిగే సద్గురు సంత్ గురులోకమసంద్ మహరాజ్ బావోజీ జాతర బ్రహ్మోత్సవంలో పాల్గొంటారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు రావాలని కోరారు.
News April 14, 2025
ఎన్టీఆర్: చెట్ల క్రింద నిలబడవద్దు: APSDMA ఎండీ

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తాజాగా హెచ్చరించింది. ఈ మేరకు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ ప్రజానీకాన్ని హెచ్చరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ప్రజలు నిలబడరాదని ఆయన సూచించారు.