News April 4, 2025
నార్నూర్: యాక్సిడెంట్.. యువకుడి దుర్మరణం

నార్నూర్ మండలం గంగాపూర్‌లో ఎంగేజ్మెంట్కి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పుసిగూడ ఘాట్ వద్ద జరిగిన యాక్సిడెంట్లో యువకుడు దుర్మరణం చెందారు. యువకుడిని ఆటోలో ఉట్నూర్ ఆసుపత్రికి తరలించగా మృతిచెందారు. మృతుడు తొడసం జంగుగా గుర్తించారు. తిర్యాణి మండలం సుంగాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడికి భార్య పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 11, 2025
ADB: లింగ నిర్ధారణ పరీక్షలు నేరం: DMHO

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ పేర్కొన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో భాగంగా ప్రత్యేక తనిఖీ బృందం ADBలోని రెండు స్కానింగ్ సెంటర్లను శుక్రవారం తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చారు. తనిఖీ బృందం సభ్యులు డిప్యూటీ డీఎంహెచ్ఓ సాధన, డాక్టర్ క్రాంతి, యశోద, వైష్ణవి ఉన్నారు.
News April 11, 2025
ఆదిలాబాద్: సర్టిఫికెట్ పొందేందుకు రేపే ఆఖరు

ఐటీఐలో ఏదైన ట్రేడ్‌కు సంబంధించి మూడేళ్ల అనుభవం కలిగిన అభ్యర్థులు సర్టిఫికెట్ పొందేందుకు ఈనెల 12లోపు వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో ఐటీఐ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు అర్హులని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News April 11, 2025
ADB: దొంగతనం.. ఇద్దరి అరెస్ట్.. మరొకరు పరార్

ADBలోని ఠాకూర్ హోటల్ సమీపంలో మిర్జానసీర్ బైగ్‌కు చెందిన లారీలో నుంచి ఆదివారం రాత్రి బ్యాటరీలు చోరీ చేసిన మరో దొంగను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. ఈ కేసులో మంగళవారం వడ్డెర కాలనీకి చెందిన సంతోశ్‌ను రిమాండ్‌కు తరలించామన్నారు. తాజాగా మరో దొంగ కార్తిక్ అలియాస్ గణేశ్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. మరో దొంగ మైనర్ అని.. అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.