News April 4, 2025

వనపర్తి: అమ్మాయిల వెంట పడితే ఇక అంతే..!

image

పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని గిరిజనుల సంక్షేమ పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. వి.రజని మాట్లాడుతూ.. బాల బాలికలను వివిధ రకాలైన లైంగిక వేధింపుల నుంచి రక్షించడానికి ఏర్పాటు చేసినట్లు ఉదాహరణలతో వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు.

Similar News

News April 12, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 12, 2025

ఏప్రిల్ 12: చరిత్రలో ఈరోజు

image

1917: భారత మాజీ క్రికెటర్ వినూమన్కడ్ జననం
1961: అంతరిక్షానికి తొలిసారిగా మనిషి ప్రయాణం (యూరీ గగారిన్)
1962: ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మరణం
1981: ప్రపంచపు మొట్టమొదటి స్పేస్ షటిల్ ‘కొలంబియా’ ప్రయోగం
2006: కన్నడ నటుడు రాజ్‌కుమార్ మరణం
* రోదసి దినోత్సవం

News April 12, 2025

ఉమ్మడి జిల్లాలో రేపు మద్యం దుకాణాలు బంద్

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని అన్ని మద్యం దుకాణాలు మూసివేయాలని జిల్లా కలెక్టర్‌లు అధికారులను ఆదేశించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూసి ఉంచాలని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులను పాటించని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

error: Content is protected !!