News March 26, 2024

MBNR: పాలమూరులో భానుడి భగభగలు.!

image

ఉమ్మడి పాలమూరులో వేసవి పూర్తిస్థాయిలో మొదలవకముందే భానుడు భగభగమంటున్నాడు. ఉదయం తొమ్మిది దాటితే చాలు ఎండ వేడిమిని ప్రజలు తట్టుకోలేక పోతున్నారు. ప్రస్తుతం మార్చి నెలలోనే పలు ప్రాంతాల్లో 33 డిగ్రీల నుంచి 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్, మే మాసాల్లో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావడానికి భయపడుతున్నారు.

Similar News

News October 3, 2024

MBNR: 20 గ్రామాలకు 3 రోజులు భగీరథ నీటి సరఫరా బంద్

image

జాతీయ రహదారి 44 వేముల వద్ద రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి. పైపు లైన్ల మార్పులు కారణంగా అడ్డాకుల మండలంలోని 17 గ్రామాలకు మూసాపేట మండలంలోని 20 గ్రామాలకు మూడు రోజులపాటు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్ చేస్తున్నట్లు జిల్లా మిషన్ భగీరథ కార్యనిర్వహక ఇంజినీర్ పి.వెంకట్ రెడ్డి వెల్లడించారు. ప్రజలు పరిస్థితులను అర్థం చేసుకొని సహకరించాలని కోరారు.

News October 3, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎల్లో అలెర్ట్

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.

News October 3, 2024

మక్తల్: డిజిటల్ హెల్త్ కార్డ్ పైలెట్ ప్రాజెక్టుకు ఎంపికైన గ్రామం ఇదే

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా నేటి నుంచి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రికార్డు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. 119 నియోజకవర్గాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద హెల్త్ కార్డులు జారీ చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు. ఇందులో మక్తల్ నియోజకవర్గం ని ఊట్కూర్ మండలం కొత్తపల్లి గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక కాబడింది. ఈరోజు నుంచి గ్రామంలో ఈనెల 7 వరకు ఇంటింటి సర్వే ఃజరగనుంది.