News April 4, 2025

భారీ వర్షాలు.. ఈ నంబర్‌కు కాల్ చేయండి: GHMC

image

TG: హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో GHMC కమిషనర్ విజయలక్ష్మి జోనల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏవైనా వర్ష సంబంధిత సమస్యలు ఉంటే సాయం కోసం 040-21111111 నంబర్‌ను సంప్రదించాలని సిటిజన్లకు సూచించారు. ఇప్పటికే నీరు నిలిచిన ప్రాంతాలను క్లియర్ చేసినట్లు తెలిపారు.

Similar News

News April 11, 2025

IPL: చెన్నైని చిత్తు చేసిన KKR

image

చెపాక్ స్టేడియంలో చెన్నైని కేకేఆర్ చిత్తు చేసింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన CSK 20 ఓవర్లలో 103 పరుగులే చేసింది. ఛేదనలో కోల్‌కతా బ్యాటర్లు వీరవిహారం చేశారు. నరైన్(44), డికాక్(23), రహానే(20) మెరుపులతో ఆ జట్టు 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కాగా ఇది సీఎస్కేకు వరుసగా ఐదో పరాజయం.

News April 11, 2025

చెన్నైపై ట్రోల్స్.. చెపాక్ స్టేడియం ఇలా అవుతుందట!

image

KKRపై చెన్నై ఘోరమైన బ్యాటింగ్‌తో నెటిజన్లు ట్రోల్స్‌తో విరుచుకుపడుతున్నారు. అసలు ఇది టీ20నా? టెస్టా? అని ప్రశ్నిస్తున్నారు. బౌలింగ్ పిచ్ అయినంత మాత్రాన మరీ ఇంత దారుణంగా బ్యాటింగ్ చేస్తారా అని ఫైరవుతున్నారు. ఈ సీజన్ ముగిసేసరికి చెన్నై చెపాక్ స్టేడియం పూర్తిగా చెట్లతో నిండిపోతుందని ఓ ఎడిటెడ్ ఫొటో వైరల్ చేస్తున్నారు. కాగా IPLలో డాట్ బాల్‌కు ఒకటి చొప్పున మొక్కలు నాటనున్నారు.

News April 11, 2025

రామరాజ్యం తీసుకురావడమే నా కోరిక: CBN

image

AP: రాష్ట్రంలో రామరాజ్య స్థాపనే తన కోరిక అని సీఎం చంద్రబాబు అన్నారు. ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణోత్సవంలో సతీసమేతంగా పాల్గొని ఆయన మాట్లాడారు. ఒంటిమిట్టలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసి, టూరిజం హబ్‌గా మార్చుతామని చెప్పారు. తిరుమలలో లాగ ఇక్కడ కూడా నిత్య అన్నదానం నిర్వహించాలని టీటీడీ బోర్డును కోరారు.

error: Content is protected !!