News April 4, 2025
WNP: ఇండియన్ ఆర్మీలో నియామకాల కోసం దరఖాస్తులు

ఇండియన్ ఆర్మీలో నియామకం కోసం ఔత్సాహిక అభ్యర్థులు ఏప్రిల్ 10వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి మహమ్మద్ జానీ పాషా తెలిపారు. ఇండియన్ ఆర్మీలో వివిధ కేటగిరీల వారిగా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్(క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్), ట్రేడ్స్మెన్ పదో తరగతి పాస్, అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ (ఎనిమిదో తరగతి పాస్) ఉత్తీర్ణత ఉండాలన్నారు. #SHARE IT.
Similar News
News April 11, 2025
జోగులాంబ గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

@మల్దకల్: అనుమానస్పదంగా ఆత్మహత్య @జిల్లాలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు ఫులే జయంతి వేడుకలు @గద్వాల: పెళ్లి వేడుకల్లో ఘర్షణ @గద్వాల్: పోషకాహార నివారణకు కలెక్టర్ ఆదేశాలు @అలంపూర్: గుడ్లు నాసిరకంగా ఉన్నాయి @అలంపూర్: వంద పడకల ఆసుపత్రికి మోక్షం ఎప్పుడో? @మల్దకల్: నిరుద్యోగ యువతకు మరో మూడు రోజులు మాత్రమే అవకాశం.
News April 11, 2025
చెన్నైపై ట్రోల్స్.. చెపాక్ స్టేడియం ఇలా అవుతుందట!

KKRపై చెన్నై ఘోరమైన బ్యాటింగ్‌తో నెటిజన్లు ట్రోల్స్‌తో విరుచుకుపడుతున్నారు. అసలు ఇది టీ20నా? టెస్టా? అని ప్రశ్నిస్తున్నారు. బౌలింగ్ పిచ్ అయినంత మాత్రాన మరీ ఇంత దారుణంగా బ్యాటింగ్ చేస్తారా అని ఫైరవుతున్నారు. ఈ సీజన్ ముగిసేసరికి చెన్నై చెపాక్ స్టేడియం పూర్తిగా చెట్లతో నిండిపోతుందని ఓ ఎడిటెడ్ ఫొటో వైరల్ చేస్తున్నారు. కాగా IPLలో డాట్ బాల్‌కు ఒకటి చొప్పున మొక్కలు నాటనున్నారు.
News April 11, 2025
గంజాయి నివారణకు రైల్వే పోలీసులతో విశాఖ సీపీ సమీక్ష

విశాఖ రైల్వే స్టేషన్ గుండా గంజాయి, మాదక ద్రవ్యాల రవాణా పూర్తిగా నిర్వీర్యం చేయడంపై రైల్వే పోలీసులతో విశాఖ సీపీ శంఖబ్రతా బాగ్చి శుక్రవారం సీపీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. రైళ్ల ద్వారా జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రైల్వే ఆస్తుల వద్ద భద్రతా, స్టేషన్ వద్ద స్కానింగ్ మిషన్ల ఏర్పాటు, స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పొదలు తొలగింపు, లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.