News April 4, 2025
వనపర్తి జిల్లా యువతకు పోలీసుల WARNING

ప్రజలు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ బుచ్చయ్య పిలుపునిచ్చారు. గురువారం వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో వారు రూపొందించిన గంజాయి, కల్తీ కల్లు నిర్మూలనపై రూపొందించిన పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. మత్తుమందుల వ్యసనాన్ని అందరం కలిసి నిర్మూలించాలన్నారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News April 12, 2025
SSMB29 రిలీజ్ ఎప్పుడంటే?

రాజమౌళి, మహేశ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న SSMB29పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ సినిమాను 2027లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి 25 లేదా 27న రిలీజ్ చేస్తారని టాక్. దీంతో మహేశ్, రాజమౌళి సృష్టించే రికార్డుల విధ్వంసం కోసం ఎదురుచూస్తామని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.
News April 12, 2025
KKR చేతిలో ఓటమిపై ధోనీ ఏమన్నారంటే?

కేకేఆర్ చేతిలో ఓటమిపై సీఎస్కే కెప్టెన్ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు పడటం ఇతర బ్యాటర్లపై ప్రభావం చూపిందన్నారు. సరిపోయేంత రన్స్ కొట్టలేదని భావిస్తున్నట్లు తెలిపారు. సవాల్‌ను స్వీకరించి పరుగులు రాబట్టేందుకు మార్గాలను అన్వేషిస్తామని చెప్పారు. వెంట వెంటనే వికెట్లు పడటంతో సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేక పోయామన్నారు.
News April 12, 2025
సెక్షన్-111 పెట్టడంపై జడ్జి ఆగ్రహం.. అసలేంటిది?

ఓ వ్యక్తిపై సెక్షన్ 111 కింద కేసు పెట్టాలంటే.. అతనిపై గత పదేళ్లలో ఒకటి కంటే ఎక్కువ ఛార్జిషీట్లు దాఖలై, వాటిలో ఒకదానినైనా కోర్టు విచారణకు స్వీకరించి ఉండాలి. BNSలోని సెక్షన్-111(1) వ్యవస్థీకృత నేరాన్ని సూచిస్తుంది. కిడ్నాప్, దొంగతనం, వాహనాల చోరీ, భూకబ్జా మొదలైన నేరాలు దీని కిందకు వస్తాయి. తాజాగా వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన <<16067210>>కిరణ్‌పై<<>> పోలీసులు ఈ కేసు పెట్టడంపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు.