News April 4, 2025
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఏమైంది..!

ఐపీఎల్ 2025లో తన తొలి మ్యాచులో భారీ విజయం సాధించిన SRH ఆ తర్వాత గాడి తప్పింది. ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఘోర పరాజయం పాలైంది. LSGపై 5 వికెట్లు, DCపై 7 వికెట్లు, KKRపై 80 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఇలాగే ఆడితే ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జట్టులోని ఆటగాళ్లు సమష్ఠిగా రాణించి విజయాలు నమోదు చేయాలని కోరుకుంటున్నారు.
Similar News
News April 12, 2025
చైనా ‘రేర్ ఎర్త్’ ఎగుమతుల నిలిపివేత

‘రేర్ ఎర్త్’ లోహాల ఎగుమతిని నిలిపేయాలని చైనా నిర్ణయించింది. ఈ నెల 4నే ఈ నిర్ణయం తీసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది. అరుదైన ఈ లోహాల్ని రక్షణ, ఇంధన, ఆటోమోటివ్ తదితర రంగాల్లో వినియోగిస్తారు. ట్రంప్ సుంకాలకు ప్రతీకారంగా చైనా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అరుదైన లోహాల దిగుమతుల్లో సుమారు 90శాతం చైనా నుంచే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ ధరలు పెరగొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
News April 12, 2025
‘విశ్వంభర’ నుంచి నేడు ఫుల్ సాంగ్

ఈరోజు హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా రాముడిపై సాగే పాటను ‘విశ్వంభర’ టీమ్ రిలీజ్ చేయనున్నారు. ఉదయం 11.12 గంటలకు పాట విడుదల కానుంది. ఆల్రెడీ నిన్న రిలీజ్ చేసిన ప్రోమోకు మంచి స్పందన లభించింది. రామజోగయ్య శాస్త్రి ఈ సాంగ్‌కు లిరిక్స్ రాయగా కీరవాణి మ్యూజిక్ అందించారు. వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా సోషియో ఫాంటసీ మూవీగా విశ్వంభర తెరకెక్కింది.
News April 12, 2025
ధోనీ వచ్చినా పాత కథే పునరావృతం

తమ జాతకాన్ని మార్చేందుకు దిగ్గజ కెప్టెన్ ధోనీపైనే సీఎస్కే ఆధారపడింది. రుతురాజ్ గాయం అనంతరం ధోనీని కెప్టెన్‌గా ప్రకటించింది. ఇక కొత్త సీఎస్కేని చూస్తారంటూ ఫ్యాన్స్ కూడా గర్వంగా చెప్పుకొన్నారు. తీరా చూస్తే పాత కథే రిపీట్ అయింది. KKR చేతిలో ఘోరంగా ఓడిపోయింది. 6 మ్యాచులాడిన CSK ఒకటే గెలిచింది. అయితే, ధోనీపై తమకు నమ్మకముందని, మళ్లీ పుంజుకుంటామని చెన్నై ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.