News April 4, 2025

ఉపాధ్యాయులను ఎక్కువ ప్రశ్నలు అడగాలి: కలెక్టర్

image

ఉపాధ్యాయులను ఎక్కువ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి విద్యార్థులకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇస్లామియా కళాశాలలో కొనసాగుతున్న అల్పసంఖ్యాకుల బాలికల గురుకుల పాఠశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 5వ తరగతి విద్యార్థులతో కాసేపు కలెక్టర్ ముచ్చటించారు. రోజు న్యూస్ పేపర్ చదివి వార్తలు తెలుసుకోవాలని అన్నారు. పాఠశాలలో మెనూ పాటించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News January 22, 2026

40వేల మందితో సమగ్ర భూసర్వే చేయించాం: జగన్

image

AP: 40వేల మంది సిబ్బందితో భూముల రీసర్వే సమగ్రంగా చేయించామని YS జగన్ పేర్కొన్నారు. ‘సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నాం. హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగించాం. ఈస్థాయిలో రైతులకు, ప్రజలకు మేలు చేసిన GOVT ఏదీలేదు. ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా డిజిటల్ రికార్డులు సిద్ధం చేశాం’ అని వివరించారు. ఏదో రాయిని పెట్టేసి వదిలేయకుండా అధికారిక సరిహద్దులు చూపేలా సమగ్ర చర్యలు తీసుకున్నామన్నారు.

News January 22, 2026

భద్రాద్రి జిల్లాలో 37 ఇంటర్ పరీక్ష కేంద్రాలు

image

కొత్తగూడెం జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు 37 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 9,278 మంది, ద్వితీయ సంవత్సరంలో 9,407 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని పేర్కొన్నారు. పరీక్షల పర్యవేక్షణకు 550 మంది ఇన్విజిలేటర్లు, 37 మంది చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించినట్లు వెల్లడించారు.

News January 22, 2026

ADB: పురు పోరు.. కమిషనర్‌ల బదిలీలు

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. బుధవారం 47 మంది అధికారులను బదిలీ చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు ఏడుగురు కమిషనర్లు బదిలీ అయ్యారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. బదిలీ అయిన అధికారులు వెంటనే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది.