News April 4, 2025
IPL: మ్యాచ్ కోసం హనీమూన్ క్యాన్సిల్ చేసుకున్నాడు

SRH తరఫున బరిలోకి దిగిన స్పిన్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ ఇటీవలే తన గర్ల్‌ఫ్రెండ్ నిష్నిని వివాహమాడారు. అంతకుముందే హనీమూన్ ట్రిప్ కూడా ప్లాన్ చేసుకున్నారు. కానీ మ్యాచ్ కోసం దాన్ని క్యాన్సిల్ చేసుకుని కోల్‌కతా వచ్చేశారు. ఒకే ఓవర్ వేసిన అతడు ఒక వికెట్ పడగొట్టారు. బ్యాటింగ్‌లోనూ అద్భుతమైన షాట్లతో ఆకట్టుకున్నారు. 29 రన్స్ చేసి పర్వాలేదనిపించారు. వేలంలో అతడిని SRH రూ.75 లక్షలకు దక్కించుకుంది.
Similar News
News April 12, 2025
పాస్ కానివారు నిరాశ చెందొద్దు: మంత్రి లోకేశ్

AP: ఇంటర్ ఫలితాల్లో మంచి ఫలితాలు వచ్చేందుకు అధ్యాపకులు, సిబ్బంది కృషి చేశారని మంత్రి లోకేశ్ అన్నారు. ఉత్తీర్ణత కానివారు నిరాశ చెందవద్దని, రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ రాయాలని సూచించారు. విద్యార్థులు నిరంతరం నేర్చుకోవాలని, జీవితంలో ఉన్నతస్థితికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.
News April 12, 2025
మార్క్ శంకర్‌కు బ్రోన్కో స్కోపీ.. ఖర్చు ఎంతంటే?

సింగపూర్ అగ్నిప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్‌కు <<16039701>>బ్రోన్కో స్కోపీ<<>> చికిత్సను అందించిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో పరిస్థితిని బట్టి చికిత్స అందిస్తారు. దీనికి రూ.5 వేల నుంచి రూ.35 వేల వరకు ఖర్చు అవుతుందని సమాచారం. మరోవైపు చికిత్స తీసుకున్న ఆసుపత్రిలో బిల్లు లక్షల్లో ఉంటుందని చర్చ జరిగినా తక్కువ ఖర్చులోనే ట్రీట్మెంట్ పూర్తైందని తెలుస్తోంది.
News April 12, 2025
దేశంలో ఉగ్రదాడులు.. నిఘా వర్గాల WARNING

ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్ రాణాను భారత్‌కు తీసుకురాగా నిఘావర్గాలు హెచ్చరికలు చేశాయి. దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాలు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేయవచ్చని తెలిపాయి. ఐఈడీ, డ్రోన్ దాడులు జరగవచ్చని రైల్వే శాఖను అప్రమత్తం చేశాయి. నదీమార్గాల్లోనూ తీవ్రవాదులు చొరబడవచ్చని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాయి.