News April 4, 2025
IPL: నేడు లక్నోతో ముంబై అమీతుమీ

IPLలో ఇవాళ మరో ఆసక్తికర పోరు జరగనుంది. రాత్రి 7.30 గంటలకు లక్నో వేదికగా ముంబై, లక్నో మధ్య మ్యాచ్ జరగనుంది. తమకు అలవాటైన రీతిలోనే MI తొలుత వరుసగా మ్యాచులు ఓడింది. కానీ సొంతగడ్డపై KKRను చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. అటు లక్నో కూడా 2 మ్యాచులు ఓడి ఒకదాంట్లో గెలిచింది. చివరిగా PBKSపై ఆ జట్టు చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఇవాళ ముంబైని ఓడించి మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది.
Similar News
News April 12, 2025
దంచికొడుతున్న SRH ఓపెనర్లు

పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో SRH ఓపెనర్లు దంచికొడుతున్నారు. అభిషేక్ శర్మ (87*), ట్రావిస్ హెడ్ (49*) ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్నారు. అభిషేక్‌కు ఓ లైఫ్ రావడంతో రెచ్చిపోయి ఆడుతున్నారు. వీరిద్దరి ధాటికి SRH 10 ఓవర్లకు 143/0 పరుగులు చేసింది. SRH విజయానికి మరో 10 ఓవర్లలో 103 రన్స్ అవసరం. మరి ఎన్ని ఓవర్లలో హైదరాబాద్ టార్గెట్ ఛేజ్ చేస్తుందో కామెంట్ చేయండి.
News April 12, 2025
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి

TG: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు పోలీసుల నుంచి అనుమతి పత్రాలు అందుకున్నారు. రజతోత్సవ సభ అనుమతుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. పోలీసులు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకోనున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.
News April 12, 2025
గ్యాస్ సబ్సిడీ జమ కాలేదా?

AP: ఆధార్/రేషన్‌కార్డుతో గ్యాస్ కనెక్షన్ లింక్ కాకపోవడంతో పలువురికి దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అందడం లేదు. మార్చి 31 నాటికి దాదాపు 14వేల మందికి సబ్సిడీ సొమ్ము బ్యాంకు అకౌంట్లో జమ కాలేదు. దీంతో ప్రజలు ఏజెన్సీలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్తగా ఆన్లైన్లో దీపం-2 డ్యాష్‌బోర్డును సిద్ధం చేసింది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.