News April 4, 2025

కుంభమేళాతో రూ.2.80 లక్షల కోట్ల బిజినెస్

image

ప్రయాగ్ రాజ్‌లో జరిగిన కుంభమేళాతో దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి ప్రోత్సాహం లభించినట్లు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నివేదిక తెలిపింది. ఈ మేళా వల్ల రూ.2.8 లక్షల కోట్ల ఆర్థిక కార్యకలాపాలు జరిగినట్లు వెల్లడించింది. కొనుగోళ్ల రూపంలో రూ.90,000 కోట్లు, ఎయిర్‌లైన్స్, హోటళ్లు తదితర రంగాల ద్వారా రూ.80,000 కోట్ల వ్యాపారం జరిగినట్లు పేర్కొంది. రోజూవారీ అవసరాల కోసం రూ.1.1 లక్షల కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిపింది.

Similar News

News April 12, 2025

చందమామపై హ్యూమన్ వేస్ట్.. ఒక్క ఐడియాకు రూ.25 కోట్లు

image

అంతరిక్షంలో పేరుకుపోయిన మానవ వ్యర్థాలను తొలగించేందుకు మంచి ఐడియా ఇచ్చే వారికి నాసా బంపరాఫర్ ప్రకటించింది. వేస్ట్‌ను రీసైక్లింగ్ చేసేందుకు వినూత్న ఐడియా ఇచ్చే వారికి రూ.25 కోట్లు ($3 మిలియన్) ఇస్తామని ప్రకటించింది. 1969-72 మధ్య కాలంలో అపోలో మిషన్ ద్వారా నాసా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపింది. దీంతో అక్కడ 96 బ్యాగుల వ్యర్థాలు పేరుకుపోయాయి. కాంటెస్ట్ పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News April 12, 2025

ఇంటర్‌లో అత్యధిక మార్కులు

image

AP: ఇంటర్ ఫలితాల్లో పలువురు సత్తా చాటారు. హర్షిణి, హేమలత, సిరి (ప్రకాశం), లాస్య (తిరుపతి)లకు సెకండియర్ MPCలో 991 మార్కులు వచ్చాయి. Bipcలో హారిక (ప్రకాశం) 991 మార్కులు సాధించింది. ఫస్టియర్ MPCలో నాదెండ్ల కృష్ణప్రియ (పొన్నూరు) 470కి 467, భాగ్యలక్ష్మి(తిరుపతి) 465, KGBV విద్యార్థిని రేవతి (అనకాపల్లి) Bipcలో 440కి 433 మార్కులు తెచ్చుకున్నారు. మీకు తెలిసిన వారిలో ఎక్కువ మార్కులు ఎన్ని? కామెంట్ చేయండి.

News April 12, 2025

3 నెలల్లో 85వేల వీసాలు.. చైనా స్నేహహస్తం!

image

సరిహద్దు వివాదాలతో భారత్‌తో కయ్యానికి కాలుదువ్వే చైనా కొంతకాలంగా మెతక వైఖరి అవలంబిస్తోంది. ఇటీవల సరిహద్దుల నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్న చైనా తాజాగా భారతీయులకు వీసాల జారీ ప్రక్రియను సులభతరం చేసింది. గత 3 నెలల్లో 85 వేల వీసాలు ఇచ్చామని చైనీస్ ఎంబసీ తెలిపింది. ‘చైనాను సందర్శించేందుకు మరింత మంది ఇండియన్ ఫ్రెండ్స్‌కు స్వాగతం’ అని ట్వీట్ చేసింది.

error: Content is protected !!