News April 4, 2025
సంగారెడ్డి జిల్లాలో తహశీల్దార్ల బదిలీలు

సంగారెడ్డి జిల్లాలో తహశీల్దార్లు బదిలీలు అయ్యారు. జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న 17 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన తహశీల్దార్లు శుక్రవారం విధుల్లో చేరాలని పేర్కొన్నారు. సాధారణ బదిలీలో భాగంగానే వీరిని బదిలీ చేసినట్లు చెప్పారు. ఖాళీగా ఉన్న చోట్ల నాయబ్ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
Similar News
News April 12, 2025
IPL: సాయి సుదర్శన్.. కన్సిస్టెన్సీ కా బాప్..!

లక్నోపై GT ఓపెనర్ సాయి సుదర్శన్(56) మరోసారి అదరగొట్టారు. IPLలో అద్భుత ప్రదర్శనతో మోస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్‌గా అనిపించుకుంటున్నారు. ఈ సీజన్‌లో 6 ఇన్నింగ్స్‌లలో 329 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నారు. లాస్ట్ 10 IPL మ్యాచుల్లో కేవలం రెండుసార్లే సింగిల్ డిజిట్ స్కోర్ చేసి.. ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు చేశారు. త్వరలోనే సాయి టీమిండియాలో చోటు దక్కించుకుంటాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
News April 12, 2025
తాడ్‌బండ్ టెంపుల్‌లో హీరోయిన్ ప్రీతి జింటా

ప్రముఖ సినీనటి, IPL పంజాబ్ కింగ్స్ జట్టు యజమాని ప్రీతి జింటా తాడ్‌బండ్‌ను సందర్శించారు. హనుమాన్ జయంతి సందర్భంగా వీరాంజనేయ స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనున్న నేపథ్యంలో ఆమె ఆలయానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె మాస్కు ధరించినట్లు తెలుస్తోంది.