News April 4, 2025
ఇంటిమేట్ సీన్‌లో ఓ నటుడు హద్దు మీరాడు: హీరోయిన్ అనుప్రియ

తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాలను హీరోయిన్ అనుప్రియా గోయెంకా పంచుకున్నారు. ఓ ముద్దు సీన్‌లో తాను ఇబ్బంది పడ్డట్లు చెప్పారు. ‘ఓ సినిమాలో కిస్సింగ్ సీన్ చేస్తున్నా. ఆ సమయంలో ఓ నటుడు నా నడుము పట్టుకోవాల్సి ఉంది. స్క్రిప్టులోనూ అదే ఉంది. కానీ అతడు మరో చోట అసభ్యకరంగా తాకడంతో ఇబ్బంది పడ్డా. వెంటనే అతడిని ప్రశ్నించలేకపోయా. కానీ ఆ తర్వాతి టేక్‌లో మాత్రం అలా చేయొద్దని హెచ్చరించా’ అంటూ చెప్పుకొచ్చారు.
Similar News
News April 12, 2025
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ షెడ్యూల్

AP: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20 వరకు జరగనున్నాయి.
*మే 12- సెకండ్ లాంగ్వేజ్
*మే 13- ఇంగ్లిష్
*మే 14- మ్యాథ్స్-1A, 2A, బోటని, సివిక్స్
*మే 15- మ్యాథ్స్- 1B, 2B, జువాలజీ, హిస్టరీ
*మే 16- ఫిజిక్స్, ఎకనామిక్స్
*మే 17- కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ
**మే 28 నుంచి జూన్ 1 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఫస్టియర్ ఉ.9-మ.12 వరకు, సెకండియర్ మ.2.30-సా.5.30 వరకు.
News April 12, 2025
IPL: సాయి సుదర్శన్.. కన్సిస్టెన్సీ కా బాప్..!

లక్నోపై GT ఓపెనర్ సాయి సుదర్శన్(56) మరోసారి అదరగొట్టారు. IPLలో అద్భుత ప్రదర్శనతో మోస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్‌గా అనిపించుకుంటున్నారు. ఈ సీజన్‌లో 6 ఇన్నింగ్స్‌లలో 329 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నారు. లాస్ట్ 10 IPL మ్యాచుల్లో కేవలం రెండుసార్లే సింగిల్ డిజిట్ స్కోర్ చేసి.. ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు చేశారు. త్వరలోనే సాయి టీమిండియాలో చోటు దక్కించుకుంటాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
News April 12, 2025
ICICI నుంచి లోన్లు తీసుకోలేదు: మంత్రి శ్రీధర్ బాబు

TG: ICICI బ్యాంకు నుంచి తాము ఎలాంటి లోన్లు తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ‘కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయినా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. AI వీడియోలు పోస్ట్ చేసి HYDకు పెట్టుబడులు, ఉద్యోగాలు రావొద్దని కుట్ర చేస్తున్నారు. స్టూడెంట్స్‌ను ప్రభావితం చేసి సర్కార్ పనుల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు’ అని మండిపడ్డారు.