News April 4, 2025

నేడు భద్రాచలంలో మంత్రి తుమ్మల పర్యటన

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం భద్రాచలంలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటలకు గోదావరి కరకట్ట పరిశీలన, 10:30 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్ల పనులు పరిశీలించనున్నారు. 11:30 గంటలకు ఆర్డీఓ కార్యాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News November 5, 2025

యూట్యూబ్‌లో నెలకు 6లక్షలు సంపాదిస్తున్న బామ్మ

image

నచ్చిన పని చేయడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించారు మహారాష్ట్రకు చెందిన సుమన్ ధమానే. 70ఏళ్లవయసులో ఆప్లీ ఆజీ అనే యూట్యూబ్ ఛానెల్‌ను మొదలు పెట్టిన ఆమెకు ప్రస్తుతం 17.9 లక్షల సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ఆ ఛానెల్‌లో ప్రధానంగా సాంప్రదాయ మహారాష్ట్ర వంటకాలే ఉంటాయి. ఆమె మనవడు యష్ సాయంతో ఆమె ఈ కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టి నెలకు 5-6 లక్షల వరకు సంపాదిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

News November 5, 2025

జీవ ఎరువులతోనే భూమాతకు రక్షణ: కలెక్టర్

image

రసాయన ఎరువుల బదులు జీవ ఎరువులను (బయో ఫెర్టిలైజర్స్) విరివిగా వాడేలా రైతుల్ని చైతన్య పరచాలని కలెక్టర్ లక్ష్మీశా అధికారులకు సూచించారు. బుధవారం జరిగిన జిల్లాస్థాయి భూమాత రక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికే కేంద్రం ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

News November 5, 2025

కోస్గి: సీఎం ఇలాకా.. క్రీడల మంత్రి జిల్లాలో ఇదీ పరిస్థితి..!

image

కోస్గి కేంద్రంలో జరుగుతున్న అండర్-17 హ్యాండ్‌బాల్ జట్ల ఎంపికకు వచ్చిన క్రీడాకారులు అసౌకర్యానికి గురయ్యారు. వారికి భోజనం చేసేందుకు సరైన స్థలం లేక డ్రైనేజీ పక్కన కూర్చుని తినాల్సి వచ్చింది. సీఎం ఇలాకా.. క్రీడల మంత్రి జిల్లాలోనే ఈ పరిస్థితి ఉండటంపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి పోటీలలోనైనా సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.