News April 4, 2025
రాములోరి కళ్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు: భద్రాద్రి ఎస్పీ

ఈనెల 6, 7 తేదీల్లో భద్రాచలంలో జరగనున్న శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవానికి ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. పార్కింగ్ స్థలాలు, కళ్యాణ మంటపం, సెక్టార్లు, లడ్డూ, తలంబ్రాల కౌంటర్ వద్దకు సులభంగా వెళ్లేందుకు QR కోడ్, ఆన్‌లైన్ లింక్ రూపొందించినట్లు పేర్కొన్నారు.
Similar News
News April 12, 2025
15% వృద్ధిరేటుతో అన్నమయ్య జిల్లా: మంత్రి BC

అన్నమయ్య జిల్లా 15% వృద్ధిరేటుతో అభివృద్ధి పథంలో నిలుస్తోందని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి BC జనార్దన్ రెడ్డి అన్నారు. రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, MLAలు షాజహాన్ బాషా, ఆరవ శ్రీధర్, కలెక్టర్ శ్రీధర్, SP విద్యాసాగర్ నాయుడు, అధికారులతో కలసి DRC సమావేశంలో పాల్గొన్నారు. అభివృద్ధి, పేదరికంలేని సమాజమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి సమన్వయంతో పనిచేయాలన్నారు.
News April 12, 2025
983 మార్కులతో సత్తా చాటిన గొల్లప్రోలు విద్యార్థిని

గొల్లప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న సాయి జ్యోతి 983 మార్కులు సాధించి ఔరా అనిపించింది. పట్టణానికి చెందిన ఆమె MPC విభాగంలో ఈ ఘనత సాధించింది. జ్యోతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివింది. కాకినాడ జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ కళాశాలలో ఎంపీసీ విభాగంగాలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.
News April 12, 2025
బెంగాల్‌లో అల్లర్లు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

వక్ఫ్ చట్టం సవరించిన నేపథ్యంలో బెంగాల్‌లో కొద్ది రోజులుగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ ‘చట్టాన్ని సవరించింది కేంద్ర ప్రభుత్వం. మేం కాదు. మీరు కేంద్రంతోనే తేల్చుకోండి. సవరించిన వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని ఇప్పటికే చెప్పాం. కాబట్టి అన్ని మతాల ప్రజలు శాంతించండి’ అని వ్యాఖ్యానించారు. కాగా ఈ అల్లర్లలో ఇప్పటివరకు ముగ్గురు చనిపోయారు.