News April 4, 2025
భద్రాచలం వెళ్తుండగా.. కాలు నుజ్జునుజ్జయింది..!

అశ్వారావుపేట మండలం అసుపాక సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చాగల్లు ప్రాంతానికి చెందిన భక్తులు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలానికి పాదయాత్రగా వెళ్తున్నారు. అలసటగా ఉండి భద్రాచలం వైపు వెళ్తున్న ట్రాక్టర్‌పై ఎక్కారు. నందిపాడు సమీపంలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మంజు అనే యువతికి కాలు నుజ్జు నుజ్జు అయ్యింది. పలువురికి గాయాలు కావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News April 8, 2025
పేదల గృహాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

ప్రకాశం జిల్లాలో పేదల గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సోమవారం ఆమె మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మే 31వ తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా 8,839 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు.
News April 8, 2025
రోడ్డు మార్గాన బెంగళూరుకు వైఎస్ జగన్

మాజీ సీఎం వైఎస్ జగన్ రామగిరి నుంచి రోడ్డు మార్గాన బెంగళూరుకు బయలుదేరారు. ఇవాళ ఉదయం పాపిరెడ్డిపల్లెకు చేరుకోగా వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హెలికాప్టర్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో హెలికాప్టర్ ఫ్రంట్ గ్లాస్ పగిలిపోయి సాంకేతిక సమస్య తలెత్తినట్లు సమాచారం. దీంతో రోడ్డు మార్గంలో బెంగళూరుకు బయలుదేరారు.
News April 8, 2025
NLG: రైతులను వేధిస్తున్న సర్వేయర్ల కొరత

జిల్లా వ్యాప్తంగా సర్వేయర్ల కొరత ఉండడంతో సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోతున్నాయి. సర్వేకు దరఖాస్తు చేసుకున్న బాధితులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. భూ తగాదాలు తీరాలన్న.. గట్టు పంచాయతీలు వచ్చిన భూ సర్వే చేసి పరిష్కరిస్తారు. కాగా జిల్లాలో సర్వేయర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో సకాలంలో సేవలు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.