News April 4, 2025

SRPT: రోడ్డు ప్రమాదంలో.. ఒకరు SPOTDEAD

image

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం హనుమంతుల గూడెం గ్రామ శివారులో చోటుచేసుకుంది. మృతుడు గరిడేపల్లి మండలం కల్మల్ చెర్వు గ్రామానికి చెందిన యాతం సైదులుగా స్థానికులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం హుజూర్నగర్ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.

Similar News

News November 5, 2025

‘Money Heist’ ప్రేరణతో ₹150 కోట్ల దోపిడీ.. చివరికి..

image

థ్రిల్లర్ సిరీస్ ‘Money Heist’ ప్రేరణతో ₹150 కోట్లు దోచుకుంది ఢిల్లీకి చెందిన గ్యాంగ్. నిందితులు అర్పిత్(ప్రొఫెసర్), ప్రభాత్(అమాండా), అబ్బాస్(ఫ్రెడ్డీ) తమ పేర్లను సిరీస్‌లో మాదిరి మార్చుకున్నారు. SMలో పలు గ్రూపులు ఏర్పాటు చేసి స్టాక్ మార్కెట్ టిప్స్ ఇచ్చారు. తర్వాత హై రిటర్న్స్ ఇస్తామని నమ్మించి ₹కోట్లు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు 2 రాష్ట్రాల్లో దాడులు చేసి వారిని పట్టుకున్నారు.

News November 5, 2025

హాస్టల్ ఘటనపై తిరుపతి కలెక్టర్ సీరియస్

image

తిరుపతి వెల్ఫేర్ హాస్టల్ <<18201992>>ఘటనలో <<>>వాచ్‌మెన్ హరి గోపాల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఇప్పటికే అతడిని సస్పెండ్ చేయగా.. ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ముని శంకర్ పర్యవేక్షణ లోపం ఉండటంతో ఆయనను సైతం సస్పెండ్ చేశారు. అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్యామసుందర్ రావుకు ఛార్జ్ మెమో జారీ చేశారు.

News November 5, 2025

ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8.30 గంటల లోపు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, సూర్యాపేట, నల్గొండ, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, MBNR, RR, HYD, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మీ ఏరియాలో వర్షం కురుస్తోందా?