News April 4, 2025
వరంగల్: జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు తండ్రి, కొడుకు

ఒడిశా రాష్ట్రంలోని పూరీలో జరుగుతున్న 57వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలకు న్యాయ నిర్ణేతగా వరంగల్ జిల్లా గీసుగొండ మండలానికి చెందిన కోట రాంబాబు ఎంపికయ్యాడు. ఆయన కుమారుడు సృజన్ ఖోఖో జట్టుకు ప్రాతినిద్యం వహించనున్నాడు. దీంతో పోటీలకు ఎంపికైన వారిని గ్రామస్థులు అభినందించారు.
Similar News
News November 9, 2025
అనంత: ఆడ, మగ మృతదేహాల కలకలం

తుంగభద్ర రిజర్వాయర్ నుంచి వచ్చే ఎగువ కాలువ(HLC)లో శనివారం సాయంత్రం 2 మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి. బొమ్మనహాల్(M) నాగలాపురం HLC 116, 117 కిలోమీటర్ల వద్ద ఆడ, మగ మృతదేహాలను స్థానికులు గుర్తించి భయాందోళనకు గురయ్యారు. వెంటనే బొమ్మనహాల్ పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరి వయసు సుమారు 45 ఏళ్లు ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
News November 9, 2025
బాడీ షేమింగ్.. హీరోయిన్‌కు క్షమాపణలు

బాడీ షేమింగ్‌కు గురైన తమిళ హీరోయిన్ <<18220614>>గౌరీ<<>> కిషన్‌కు యూట్యూబర్ కార్తీక్ క్షమాపణలు చెప్పారు. ఆమె బరువు గురించి మీడియా సమావేశంలో ప్రశ్న లేవనెత్తినందుకు విచారం వ్యక్తం చేశారు. అయితే తాను అడిగిన ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకున్నారని, తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. కాగా యూట్యూబర్ ప్రశ్నపై తమిళనాట చర్చనీయాంశంగా మారగా పలువురు సినీ ప్రముఖులు గౌరీకి మద్దతుగా నిలిచారు.
News November 9, 2025
తెలంగాణ రైతులకు బిహార్ ఎన్నికల దెబ్బ!

బిహార్ ఎన్నికలు రైతులకు సమస్యను తెచ్చి పెట్టాయి. ఓటేసేందుకు బిహారీలు సొంత రాష్ట్రానికి వెళ్తుండటంతో హమాలీల కొరత ఏర్పడి ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. మిల్లుల వద్ద లోడింగ్, అన్‌లోడింగ్ కావడం లేదు. రాష్ట్రంలోని మిల్లుల్లో 20వేల మంది హమాలీలు ఉంటే 18వేల మంది బిహారీలే. ఓటేసేందుకు రాజకీయ పార్టీలు వారికి రూ.5వేల చొప్పున ఇచ్చి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 11న అక్కడ ఎన్నికలు ముగుస్తాయి.


