News April 4, 2025

కొత్తవలస: హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు

image

కొత్తవలస పోలీస్ స్టేషన్‌లో 2022లో నమోదైన హత్య కేసులో నిందితుడు అప్పన్నదొర పాలెం పంచాయతీ జోడుమెరక గ్రామానికి చెందిన జోడి నూకరాజుకు జీవిత ఖైదు, రూ.1000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం తెలిపారు. నిందితుడు తన భార్యను పెట్రోల్ పోసి నిప్పంటించి చంపాడన్నారు. తిరిగి భార్య కనిపించలేదని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కోర్టులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందన్నారు.

Similar News

News April 12, 2025

ఇంటర్ రిజల్ట్స్.. 12 వ స్థానంలో విజయనగరం జిల్లా

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో విజయనగరం జిల్లాలో 17,636 మందికి 11,525 మంది పాసయ్యారు. 65 శాతం పాస్ పర్సంటేజీతో ఫస్ట్ ఇయర్‌లో రాష్ట్రంలో 12వ స్థానంలో జిల్లా నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 15,512 మంది పరీక్షలు రాయగా 12,340 మంది పాసయ్యారు. 80 శాతం పాస్ పర్సంటేజీతో సెకండియర్ ఫలితాల్లో రాష్ట్రంలో విజయనగరం జిల్లా 15వ స్థానంలో నిలిచింది.

News April 12, 2025

VZM: ‘14న PGRS కార్యక్రమం రద్దు’

image

అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ఈనెల 14న జిల్లా పోలీస్ కార్యాలయంలో జరగనున్న PGRS కార్యక్రమాన్ని రద్దు చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం తెలిపారు. అంబేడ్కర్ జయంతిని సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించడంతో ఆ రోజు వినతులు స్వీకరించబోమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఫిర్యాదుదారులు గమనించాలని సూచించారు.

News April 12, 2025

విజయనగరం: నేడే ఇంటర్ రిజల్ట్స్

image

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. విజయనగరం జిల్లాలో ఫస్టియర్ 20,902 మంది, సెకండియర్ 18,384 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకప్పుడు రిజల్ట్స్ కోసం నెట్ సెంటర్ల చుట్టూ తిరిగేవారు. నేడు సెల్‌ఫోన్‌లోనే చూసుకుంటున్నారు. రిజల్ట్స్ వెతికేందుకు టెన్షన్ పడొద్దు.. వే2న్యూస్ యాప్‌లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు.

error: Content is protected !!