News April 4, 2025
వెబ్‌సైట్లో సీనియారిటీ ఉపాధ్యాయుల తుది జాబితా

వెబ్‌సైట్లో ఉపాధ్యాయుల సీనియారిటీ తుది జాబితాను అందుబాటులో ఉంచినట్లు నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలాజీ రావు తెలిపారు. ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులతో పాటు, ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ వారీగా పదోన్నతి జాబితాను కూడా అందుబాటులో ఉంచామన్నారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 11వ తేదీలోగా తెలపాలన్నారు.
Similar News
News October 26, 2025
నెల్లూరులో పదో తరగతి విద్యార్థుల మిస్సింగ్

ఇద్దరు విద్యార్థుల మిస్సింగ్ వ్యవహారం నెల్లూరులో కలకలం రేపుతుంది. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనలక్ష్మిపురంలో ఇద్దరు విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చింతవరానికి చెందిన లోకేష్, అనంతసాగర్ మండలం దేవరాయపల్లికి చెందిన రాకేష్ ఇద్దరు కలిసి హాస్టల్లో ఉంటున్నారు. అయితే వారు మూడు రోజుల నుంచి కనిపించకపోవడంతో స్కూల్ ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News October 26, 2025
నెల్లూరు: ప్రైవేట్ ట్రావెల్ బస్సు నుంచి పొగలు

కర్నూలు(D) బస్సు దుర్ఘటన మరకవముందే పొదలకూరు(M) మర్రిపల్లి వద్ద మరో బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బెంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో శనివారం రాత్రి పొగలు వచ్చాయి. దీంతో బస్సు ఆపేశారు. ప్రయాణికులు వెంటనే అందులోంచి దిగేశారు. ఎలాంటి ప్రమాదం జరగపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం వారు మరో బస్సులో వెళ్లిపోయారు.
News October 26, 2025
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఉమిద్ పోర్టల్: అజీజ్

వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఉమిద్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. నూతనంగా అమల్లోకి వచ్చిన ఉమిద్ యాక్ట్ ప్రకారం, రాష్ట్రంలోని అన్ని వక్ఫ్ ఆస్తులు, మసీదులు, దర్గాలు, మదర్సాలు తప్పనిసరిగా డిజిటల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వక్ఫ్ సంస్థల నిర్వాహకులకు ఆయన పిలుపునిచ్చారు.


