News April 4, 2025

హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు

image

విజయనగరం జిల్లా కొత్తవలస పోలీస్ స్టేషన్‌లో 2022లో నమోదైన హత్య కేసులో నిందితుడు జోడి నూకరాజుకు జీవిత ఖైదు, రూ.1000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని SP వకుల్ జిందాల్ గురువారం తెలిపారు. అప్పన్నదొర పాలెం పంచాయతీ జోడుమెరక గ్రామానికి చెందిన నూకరాజు తన భార్యను చంపి కనిపించట్లేదని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కోర్టులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందన్నారు.

Similar News

News November 4, 2025

వట్లూరు వద్ద రైలు నుంచి జారిపడి వృద్ధుడు మృతి

image

బెంగళూరుకు చెందిన ఉమాశంకర్ (72) యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో బెంగళూరు నుంచి భువనేశ్వర్‌కు పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ప్రమాదవశాత్తు మరణించారు. మంగళవారం ఉదయం ఏలూరు రైల్వే స్టేషన్ పరిధిలోని వట్లూరు సమీపంలో రైలు నుంచి జారిపడి ఆయన మృతి చెందారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 4, 2025

ఉసిరి నూనెతో ఒత్తైన జుట్టు

image

మన పూర్వీకులు తరతరాలుగా కురుల ఆరోగ్యం కోసం ఉసిరి నూనెను వాడుతున్నారు. ఈ నూనె వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే కురుల పెరుగుదలను వృద్ధి చేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులోని యాంటీ యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ వెంట్రుకలు రాలకుండా చూస్తాయి. కురులు తేమగా, మెరిసేలా చేస్తాయి. అలాగే చుండ్రుతో ఇబ్బంది పడుతుంటే ఉసిరి నూనెలోని యాంటీ మైక్రోబియల్ గుణం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. <<-se>>#haircare<<>>

News November 4, 2025

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

image

జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్తకోట(M) పాలెం, కానాయపల్లి గ్రామాల్లోని చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వెంటనే సీరియల్ నంబర్ల వారీగా ఎంత ధాన్యం తెచ్చారు, తేమ శాతం ఎంత ఉంది అనేది రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు.