News April 4, 2025

కామవరపుకోట: కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య

image

కామవరపుకోట మండలం ఉప్పలపాడులో గురువారం గంగాభవానీ అనే వివాహిత కడుపునొప్పి తట్టుకోలేక ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త, పిల్లలతో కలిసి ఇటీవల భవానీ పుట్టింటికి వచ్చింది. గత కొంతకాలంగా ఆమె కడుపు నొప్పితో బాధపడుతోందని, బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు గంగాభవాని తండ్రి సూర్యనారాయణ తెలిపారు.

Similar News

News January 9, 2026

అమరావతిలో 3500 టన్నుల కంచుతో భారీ NTR విగ్రహం

image

AP: రాజధాని అమరావతి ప్రాంతంలోని నీరుకొండలో సుమారు 3500 టన్నుల కంచుతో భారీ NTR విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన డిజైన్లను క్యాబినెట్ సబ్‌ కమిటీ పరిశీలించింది. విగ్రహంతోపాటు స్మృతివనం డిజైన్లను ఫైనలైజ్ చేసేందుకు ప్రభుత్వం సబ్‌ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (AGICL) పర్యవేక్షించనుంది.

News January 9, 2026

రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల విద్యార్థి దుర్మరణం

image

రంగారెడ్డి జిల్లాలోని మోకిల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్‌కు చెందిన విద్యార్థి దుర్మరణం చెందారు. మంచిర్యాలకు చెందిన దేవుళ్ళ సూర్యతేజ హైదారాబాద్‌లో చదువుతున్నాడు. స్నేహితుడి బర్త్ డే వేడుకలు జరుపుకొని స్నేహితులతో కలసి కారులో తిరిగి వస్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది.

News January 9, 2026

శిథిలావస్థలో చరిత్ర గల శివాలయం

image

నందవరం మండలం రాయచోటిలో శ్రీకృష్ణదేవరాయల నాటి చరిత్ర కలిగిన శివాలయం ఉంది. ఈ ఆలయం పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది. పలుమార్లు ఈ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు లంకె బిందెల కోసం తవ్వకాలు జరిపి, ఆలయాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు జరిపినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో గ్రామస్థులు, శివభక్తులు రెండేళ్లుగా ఆలయం పరిసరాలను శుభ్రం చేస్తూ కాపాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా రక్షణ కల్పించాలని కోరారు.