News April 4, 2025
IPL: రూ.23.75 కోట్లు పెట్టింది ఇందుకే..

మెగా వేలంలో రూ.23.75 కోట్లకు అమ్ముడైన వెంకటేశ్ అయ్యర్ ఈ సీజన్లోని తొలి మూడు మ్యాచుల్లో పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డారు. నిన్న SRHపై తిరిగి ఫామ్ అందుకున్నారు. 29 బంతుల్లోనే 3 సిక్సర్లు, 7 ఫోర్లతో 60 రన్స్ చేశారు. ఆరంభంలో స్లోగా ఆడిన అతడు.. చివరి ఓవర్లలో రింకూతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. SRHపై వెంకీకి మంచి రికార్డు ఉంది. ఆరెంజ్ ఆర్మీపై 9 మ్యాచుల్లో 152 స్ట్రైక్ రేటుతో 208 రన్స్ చేశారు.
Similar News
News April 16, 2025
ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన స్పాటిఫై

పాటల యాప్ స్పాటిఫై ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయింది. పాటలు వెతకడం నుంచి ఆర్టిస్ట్ ప్రొఫైల్ చూడటం వరకు వినియోగదారులు పలు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. యాప్ హ్యాక్ అయిందన్న వార్తలు రాగా వాటిని సంస్థ కొట్టిపారేసింది. యాప్‌ను పునరుద్ధరించడంపై కృషి చేస్తున్నామని, వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. పలు సమస్యలు వస్తున్నా యాప్‌లో యాడ్స్ మాత్రం కొనసాగుతుండటం గమనార్హం.
News April 16, 2025
పెళ్లి చేసుకున్న స్టార్ నటి

SVSC, దమ్ము, ఢమరుకం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అభినయ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన చిన్ననాటి స్నేహితుడు కార్తీక్‌తో ఏడడుగులు వేశారు. పదిహేనేళ్ల నుంచి అభినయ, కార్తీక్ ప్రేమించుకుంటున్నారు. ఈక్రమంలోనే ఇవాళ పెళ్లితో ఒక్కటయ్యారు. కాగా పుట్టుకతోనే చెవిటి, మూగ అయిన అభినయ తన అద్భుతమైన నటనతో లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్నారు.
News April 16, 2025
IPL: ఒకే ఓవర్‌లో 11 బంతులేశాడు

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ ఆఖరి ఓవర్లో చెత్త ప్రదర్శన చేశారు. ఏకంగా 11 బంతులు వేయగా ఇందులో నాలుగు వైడ్లు, ఒక నోబాల్ ఉన్నాయి. సిక్సు, ఫోర్, నాలుగు సింగిల్స్ కలుపుకొని 19 పరుగులు సమర్పించుకున్నారు. దీంతో IPLలో ఒకే ఓవర్లో 11 బంతులు వేసిన నాలుగో బౌలర్‌గా నిలిచారు. అంతకుముందు తుషార్ దేశ్ పాండే, సిరాజ్, శార్దూల్ కూడా ఓవర్లో 11 బంతులు వేసి చెత్త రికార్డు మూటగట్టుకున్నారు.