News April 4, 2025
నేటి నుంచి సబ్ రిజస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్

AP: రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి వేచి చూడకుండా నేటి నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి రానుంది. దీంతో స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్తే చాలు. ఇప్పటికే కృష్ణా (D)లో ఈ విధానం పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు అవుతోంది. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొత్త విధానం అందుబాటులోకి రానుంది. మంత్రి అనగాని సచివాలయం నుంచి ఈ సేవలను ప్రారంభిస్తారు.
Similar News
News April 16, 2025
ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన స్పాటిఫై

పాటల యాప్ స్పాటిఫై ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయింది. పాటలు వెతకడం నుంచి ఆర్టిస్ట్ ప్రొఫైల్ చూడటం వరకు వినియోగదారులు పలు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. యాప్ హ్యాక్ అయిందన్న వార్తలు రాగా వాటిని సంస్థ కొట్టిపారేసింది. యాప్‌ను పునరుద్ధరించడంపై కృషి చేస్తున్నామని, వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. పలు సమస్యలు వస్తున్నా యాప్‌లో యాడ్స్ మాత్రం కొనసాగుతుండటం గమనార్హం.
News April 16, 2025
పెళ్లి చేసుకున్న స్టార్ నటి

SVSC, దమ్ము, ఢమరుకం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అభినయ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన చిన్ననాటి స్నేహితుడు కార్తీక్‌తో ఏడడుగులు వేశారు. పదిహేనేళ్ల నుంచి అభినయ, కార్తీక్ ప్రేమించుకుంటున్నారు. ఈక్రమంలోనే ఇవాళ పెళ్లితో ఒక్కటయ్యారు. కాగా పుట్టుకతోనే చెవిటి, మూగ అయిన అభినయ తన అద్భుతమైన నటనతో లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్నారు.
News April 16, 2025
IPL: ఒకే ఓవర్‌లో 11 బంతులేశాడు

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ ఆఖరి ఓవర్లో చెత్త ప్రదర్శన చేశారు. ఏకంగా 11 బంతులు వేయగా ఇందులో నాలుగు వైడ్లు, ఒక నోబాల్ ఉన్నాయి. సిక్సు, ఫోర్, నాలుగు సింగిల్స్ కలుపుకొని 19 పరుగులు సమర్పించుకున్నారు. దీంతో IPLలో ఒకే ఓవర్లో 11 బంతులు వేసిన నాలుగో బౌలర్‌గా నిలిచారు. అంతకుముందు తుషార్ దేశ్ పాండే, సిరాజ్, శార్దూల్ కూడా ఓవర్లో 11 బంతులు వేసి చెత్త రికార్డు మూటగట్టుకున్నారు.