News April 4, 2025

జమ్మికుంట: మున్సిపల్ కమిషనర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

image

ఆస్తిపన్ను వసూళ్లలో రాష్ట్రస్థాయిలో జమ్మికుంట మొదటిస్థానం దక్కించుకుంది. దీంతో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్‌కు మున్సిపల్ పరిపాలన కమిషనర్, డైరెక్టర్ కె.శ్రీదేవి హైదరాబాద్‌లో గురువారం రాష్ట్రస్థాయి ప్రశంసాపత్రం అందజేశారు. అదేవిధంగా చొప్పదండి పట్టణంలో 84శాతం ఆస్తిపన్ను వసూలు చేసినందుకు మున్సిపల్ కమిషనర్ నాగరాజును అభినందించారు.

Similar News

News September 11, 2025

గర్భిణులకు పీహెచ్‌సీలలో కాన్పులు చేయించాలి: DMHO

image

కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అధ్యక్షతన ఆశా ఫెసిలిటేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (పీహెచ్‌సీ) మొదటి కాన్పుల కోసం గర్భిణులను ప్రోత్సహించాలని సూచించారు. తద్వారా సాధారణ ప్రసవాలు జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు.

News September 10, 2025

KNR: ‘దివ్యాంగులు జాబ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోండి’

image

ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం దివ్యాంగులు ప్రత్యేకంగా రూపొందించిన జాబ్‌ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు మనోహర స్వామి తెలిపారు. టెన్త్ సర్టిఫికేట్ ఆధారంగా www.pwdjob.portal.telangana.gov.in వెబ్‌సైట్‌లో ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలని కోరారు. ఈ పోర్టల్ ద్వారా 300కు పైగా కంపెనీలలో ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.

News September 10, 2025

KNR: TGCPGET ఫలితాల్లో SRR జంతు శాస్త్ర విద్యార్థుల రాష్ట్రస్థాయి ర్యాంకులు

image

స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలోని జంతు శాస్త్ర విభాగంలో విద్యార్థి ఏ.శివప్రసాద్ రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించారు. దీనితో పాటుగా ఎన్.ఆదిత్య 40వ ర్యాంకు, సీహెచ్. శివాజీ 70వ ర్యాంకు, జె.సంహిత 100 ర్యాంకు, కే.సాయితేజ 107, అనేక మంది విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ, జంతుశాస్త్ర విభాగాధిపతి డా.కె.కిరణ్మయి విద్యార్థులను సన్మానించారు.