News April 4, 2025
గద్వాల: చికిత్స పొందుతూ మృతి

స్వచ్ఛంద సంస్థలో పని చేస్తూ మహిళకు ఆపద వచ్చిందంటే సామాజిక సేవలో ముందుడే జయభారతి గురువారం రాత్రి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొన్ని రోజుల క్రితం ఇంట్లో వంట చేస్తుండగా చీరకు నిప్పు అంటుకొని ప్రమాదం జరగగా మెరుగైన చికిత్స కోసం అపోల ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజుల నుంచి చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News April 8, 2025
కామారెడ్డిలో కల్తీ కల్లు తాగి 58 మందికి అస్వస్థత

కల్తీ కల్లు తాగి 58 మంది అస్వస్థతకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ మండలం రామరంచ గ్రామాలకు చెందిన 58 మంది సోమవారం కల్లు దుకాణాల్లో కల్తీ కల్లు తాగారు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది వెంటనే 46 బాన్సువాడ ఆసుపత్రికి, 12 మందిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.

అన్నమయ్య: రూ.50 పెంపు.. రూ.2.50కోట్ల భారం

అన్నమయ్య జిల్లాలోని పేద ప్రజలకు మరో షాక్ తగిలింది. గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచడంతో సామాన్యులపై మరింత భారం పడనుంది. జిల్లాలో 5లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. గతంలో రూ.853గా ఉన్న సిలిండర్ రూ.903కు చేరడంతో జిల్లాలోని వినియోగదారులపై అదనంగా రూ.2.50కోట్లకు పైగా భారం పడనుంది. దీనిపై మీ కామెంట్.