News April 4, 2025
రాష్ట్రంలో నియంత్రణలోనే ఎయిడ్స్.. స్థానం మెరుగుదల

AP: ఎయిడ్స్ నియంత్రణలో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మంచి పనితీరు కనబరిచింది. గతేడాది వరకు 17వ స్థానంలో ఉన్న ఏపీ ప్రస్తుతం 7వ ప్లేస్‌కు చేరినట్లు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(న్యాకో) తెలిపింది. 2024 APR- DEC మధ్య మంచి పనితీరు కనబరిచినట్లు చెప్పింది. 2004 నుంచి రాష్ట్రంలో దాదాపు 2,25,000 మంది బాధితుల్ని గుర్తించినట్లు వెల్లడించింది. వ్యాధి నియంత్రణకు రూ.127cr ఖర్చు చేసినట్లు న్యాకో పేర్కొంది.
Similar News
News April 5, 2025
సినిమాల్లో ఏజ్ గ్యాప్ సాధారణం: అమీషా పటేల్

సికిందర్ మూవీలో నటించిన సల్మాన్ ఖాన్, రష్మిక మధ్య 31 ఏళ్ల <<15866268>>ఏజ్ గ్యాప్‌పై<<>> జరుగుతున్న ట్రోల్స్‌పై హీరోయిన్ అమీషా పటేల్ స్పందించారు. సినిమాల్లో నటుల మధ్య వయసు వ్యత్యాసం సాధారణ విషయమన్నారు. గదర్ చిత్రంలో తనకు, సన్నీ డియోల్‌కు మధ్య 20 ఏళ్ల గ్యాప్ ఉందని చెప్పారు. తమ మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవడంతో మూవీ సూపర్ హిట్టయ్యిందన్నారు. ఏదిఏమైనా సల్మాన్ లవ్లీ మ్యాన్ అని పేర్కొన్నారు.
News April 5, 2025
INC, BRS దూరం.. రసవత్తరంగా MLC ఎన్నిక

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ నిర్ణయించాయి. దీంతో బీజేపీ, ఎంఐఎం మధ్యే పోటీ రసవత్తరంగా జరగనుంది. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ నుంచి గౌతమ్‌రావు బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అంతర్గతంగా ఎవరికి మద్దతు ఇస్తాయనేదానిపైనా ఆసక్తి నెలకొంది. కాగా ఈనెల 23న పోలింగ్ జరగనుండగా 112 మంది ఓటు వేయనున్నారు.
News April 5, 2025
BREAKING: పపువా న్యూగినియాలో భారీ భూకంపం

పపువా న్యూగినియాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.2గా నమోదైంది. యూఎస్ సునామీ వార్నింగ్ సెంటర్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప కేంద్రం 49 కి.మీ లోతున ఉన్నట్లు అధికారులు తెలిపారు. గంట వ్యవధిలోనే మూడు సార్లు భూమి కంపించినట్లు పేర్కొన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మయన్మార్‌లో సంభవించిన భూకంపంలో దాదాపు 3000 మంది మరణించిన విషయం తెలిసిందే.