News April 4, 2025
దేవసేన శోభా బర్త్ డే.. మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు తమ ముద్దుల కుమార్తె దేవసేన శోభా MM తొలి పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను మంచు మనోజ్ నెట్టింట షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘అంతకు ముందు మేము ముగ్గురం. ఏడాది క్రితం నలుగురం అయ్యాం. దేవసేన శోభ జననం మా జీవితాల్లో వెలుగుతోపాటు ధైర్యాన్ని, అంతులేని సంతోషాన్ని తీసుకొచ్చింది. కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుకుంటాం’ అని రాసుకొచ్చారు.
Similar News
News September 18, 2025
మంచిర్యాల: ‘పట్టు పురుగుల పెంపకాన్ని ప్రోత్సహించాలి’

ఆదివాసీల అభివృద్ధికి, పట్టు పురుగుల పెంపకానికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందించాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లాలో పట్టు పురుగుల పెంపకంపై సచివాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. నాయక్ పోడు హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రాజన్న, జిల్లా అధ్యక్షుడు పెద్ది భార్గవ్, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు శేఖర్, రైతులు తదితరులు ఉన్నారు.
News September 18, 2025
జూబ్లీ బైపోల్.. ఢిల్లీలో పైరవీలు!

TG: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ కోసం ఢిల్లీలో భారీ లాబీయింగ్ జరుగుతోంది. ముఖ్యంగా దానం నాగేందర్ ఢిల్లీతో పాటు బెంగళూరుకు చక్కర్లు కొడుతున్నారు. హస్తిన నేతలతో పాటు AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడిని కలిసి బీఫాం కోరారని తెలుస్తోంది. అటు ఢిల్లీకి వెళ్లిన CM రేవంత్‌తో ఖర్గే తనయుడు ఈ అంశంపై కాసేపటి క్రితం భేటీ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఖర్గేతో రేపు ఉదయం రేవంత్ సమావేశం కానున్నారు.
News September 18, 2025
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మంత్రి సుభాష్ భేటీ

వెలగపూడి సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ఆయన ఛాంబర్‌లో గురువారం కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు. పంచాయితీరాజ్ శాఖతో కార్మికశాఖకు ముడిపడి ఉన్న అంశాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మంత్రి ప్రస్తావించారు. వీటిపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.