News April 4, 2025
రామచంద్రపురం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రామచంద్రపురం బైపాస్ రోడ్‌లో గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని పి.గన్నవరం మండలం గంటి పెదపూడికి చెందిన వీరి సాయి వెంకటకృష్ణ (20) మృతి చెందాడు. దాసరి శ్రీనుతో కలిసి బైక్‌పై కాకినాడ నుంచి స్వగ్రామం గంటి పెదపూడి వెళ్తుండగా వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకటకృష్ణ అక్కడికక్కడే చనిపోగా దాసరి శ్రీను గాయపడ్డాడు. క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 15, 2025
వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జనగామ కలెక్టర్

విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకై జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ దిక్సూచి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దిక్సూచితో సమగ్రాభివృద్ధితో పాటు సమగ్ర ఆరోగ్య పరిరక్షణ ఉంటుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి హెల్త్ కార్డు అందజేయనున్నట్లు తెలిపారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై శ్రద్ద పెట్టడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అన్ని పాఠశాలలో అమలు చేస్తామన్నారు.
News September 15, 2025
HYD: ఏళ్లకేళ్లుగా సిటీలోనే తిష్ట!

నగరంలోని మెడికల్ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 64 మందికి ప్రభుత్వం అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించింది. వారిని ఇక్కడి నుంచి బదిలీలు చేయడం లేదు. జిల్లా కేంద్రాల్లో ఉన్న వారిని ఇక్కడికి తెచ్చి.. ఇక్కడున్న వారిని జిల్లా కేంద్రాలకు పంపాలని జిల్లాల్లోని వారు కోరుతున్నారు. అయితే ఏళ్లకేళ్లుగా ఇక్కడే తిష్టవేసుకొని ఉంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
News September 15, 2025
షాన్‌దార్ హైదరాబాద్.. ఇక పదిలం

HYD సంపద చారిత్రక కట్టడాలే. 12 వారసత్వ కట్టడాలను పరిరక్షించి వాటికి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లకు కూడా ఆహ్వానించింది. ఖైరతాబాద్ మసీదు, రొనాల్డ్ రాస్ భవనం, షేక్‌పేట మసీదు, చెన్నకేశవస్వామి గుడి, రేమండ్ సమాధి, హయత్‌బక్షిబేగం, పురానాపూల్ దర్వాజా, టోలి మసీదు, ఖజానా భవన్ (గోల్కొండ), షంషీర్ కోట, గన్‌ఫౌండ్రి, మసీదు ఇ మియన్ మిష్క్‌ను అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు.