News April 4, 2025

వరంగల్: మాయదారి వానలు.. అప్పులే గతి!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం పంటలన్నీ చివరి దశకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వర్షం పడితే అప్పులే దిక్కు అని ఓరుగల్లు రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. పర్వతగిరి, నెక్కొండ, రాయపర్తిలో మొక్కజొన్న, వరి చివరిదశకు చేరుకోగా.. తొర్రూరు, కొత్తగూడతో పాటు పలుప్రాంతాల్లో పంటకోసి కుప్పనూర్చారు. ఇప్పుడు ఈదురు గాలులతో వర్షం పడితే పంట నేలకు ఒరిగే అవకాశముంది. వర్షం ఎప్పుడు పడుతుందోనని ఆందోళన పడుతున్నారు.

Similar News

News April 5, 2025

MHBD: భద్రాచలానికి RTC ప్రత్యేక బస్సులు

image

భద్రాచలంలో జరుగు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి మహబూబాబాద్ డిపో నుంచి 5 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఎం శివప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈనెల నెల 6వ తేదీ ఉదయం 5 గంటల నుంచి  ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులు నడుస్తాయన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వెళ్లే మహబూబాబాద్ పరిసర ప్రజలు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News April 5, 2025

SRD: అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: కలెక్టర్ క్రాంతి

image

సన్న బియ్యం పంపిణీలో డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వల్లూరు క్రాంతి హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన బియ్యం అందించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. అంతకుముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

News April 5, 2025

సినిమాల్లో ఏజ్ గ్యాప్ సాధారణం: అమీషా పటేల్

image

సికిందర్ మూవీలో నటించిన సల్మాన్ ఖాన్, రష్మిక మధ్య 31 ఏళ్ల <<15866268>>ఏజ్ గ్యాప్‌పై<<>> జరుగుతున్న ట్రోల్స్‌పై హీరోయిన్ అమీషా పటేల్ స్పందించారు. సినిమాల్లో నటుల మధ్య వయసు వ్యత్యాసం సాధారణ విషయమన్నారు. గదర్ చిత్రంలో తనకు, సన్నీ డియోల్‌కు మధ్య 20 ఏళ్ల గ్యాప్ ఉందని చెప్పారు. తమ మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవడంతో మూవీ సూపర్ హిట్టయ్యిందన్నారు. ఏదిఏమైనా సల్మాన్ లవ్లీ మ్యాన్ అని పేర్కొన్నారు.

error: Content is protected !!