News April 4, 2025

హనుమకొండ: మాయదారి వానలు.. అప్పులే గతి!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం పంటలన్నీ చివరి దశకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వర్షం పడితే అప్పులే దిక్కు అని ఓరుగల్లు రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. పర్వతగిరి, నెక్కొండ, రాయపర్తిలో మొక్కజొన్న, వరి చివరిదశకు చేరుకోగా.. తొర్రూరు, కొత్తగూడతో పాటు పలుప్రాంతాల్లో పంటకోసి కుప్పనూర్చారు. ఇప్పుడు ఈదురు గాలులతో వర్షం పడితే పంట నేలకు ఒరిగే అవకాశముంది. వర్షం ఎప్పుడు పడుతుందోనని ఆందోళన పడుతున్నారు.

Similar News

News April 8, 2025

భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలి: భద్రకాళి ఆలయ ఈవో

image

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ కార్య నిర్వహణాధికారి (EO) శేషు భారతి కోరారు. మహిళలు ముఖ్యంగా గాజులు, బొట్టు ధరించాలని, జుట్టు విరబోసుకొని రావొద్దన్నారు. నిబంధనలు పాటించకుంటే ఆలయంలోకి అనుమతించబోమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆలయంలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

News April 8, 2025

నల్గొండ జిల్లాలో 40 డిగ్రీల దాటిన ఎండ !

image

నల్లగొండ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సోమవారం 40.01 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో జిల్లాలోని ప్రధాన రహదారులన్నీ కూడా బోసిపోయి కనిపిస్తున్నాయి. నల్గొండ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News April 8, 2025

కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

image

TG: త్వరలో భారీ భూకుంభకోణాన్ని బయటపెడతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 400 ఎకరాలు కాదు.. దాని వెనుక రూ.వేల కోట్ల వ్యవహారం ఉందన్నారు. ఈ కుంభకోణంలో బీజేపీ ఎంపీ ఉన్నారన్నారు. ఒకరు ఢిల్లీ నేత చెప్పులు మోస్తే.. మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారని విమర్శించారు. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలోనే ఉందని ఆరోపించారు.

error: Content is protected !!