News April 4, 2025
రేషన్ షాపుల వద్ద నో స్టాక్ బోర్డులు!

TG: రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కొనసాగుతోంది. 3 రోజుల్లో దాదాపు 41వేల టన్నులకు పైగా బియ్యాన్ని సరఫరా చేసినట్లు సమాచారం. సన్నబియ్యం ఇస్తుండడంతో రేషన్ షాపులకు జనం భారీగా వస్తున్నారు. దీంతో మేడ్చల్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లోని దుకాణాల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిచ్చాయి. మళ్లీ స్టాక్ తెప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మీరు బియ్యం తెచ్చుకున్నారా? క్వాలిటీ ఎలా ఉంది?
Similar News
News September 12, 2025
పాలలో వెన్న శాతం పెరగాలంటే..

పాల కేంద్రాల్లో వెన్న శాతాన్ని బట్టి పాల ధరను నిర్ణయిస్తారు. గేదె పాలలో వెన్న ఎక్కువగా 6%-8%, దేశవాళీ పాడి పశువుల పాలల్లో 4-4.5%, సంకర జాతి పాడి పశువుల పాలలో 3-4% వెన్న ఉంటుంది. పప్పుజాతి పశుగ్రాసాలను, గడ్డిజాతి, ధాన్యపు జాతి పశుగ్రాసాలను, జొన్నచొప్ప, సజ్జ చొప్ప, మొక్కజొన్న చొప్పలను ఎండు గడ్డిగా పశువులకు అందించాలి. ఇవి లేనప్పుడు ఎండు వరిగడ్డిని పశువుకు మేతగా ఇస్తే పాలలో వెన్నశాతం తగ్గదు.
News September 12, 2025
నవంబర్‌లో భారత్‌కు డొనాల్డ్ ట్రంప్?

ఈ ఏడాది భారత్‌లో జరగబోయే క్వాడ్ సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉందని యూఎస్ అంబాసిడర్ టు ఇండియా సెర్గీ గోర్ తెలిపారు. ఈ సమ్మిట్ కోసం ట్రంప్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా వచ్చే నవంబర్‌లో ఢిల్లీలో క్వాడ్ సదస్సు జరగనుంది. దీనికి భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, జపాన్, యూఎస్ నేతలు హాజరు కానున్నారు.
News September 12, 2025
సరస్వతీ దేవి రూపం ఎందుకు విశిష్టమైనది?

చదువుల తల్లి సరస్వతీ దేవి జ్ఞానం, కళలు, ధ్యానాలకు ప్రతీక. ఆమె చేతిలో ఉండే వీణ సంగీతం, సృజనాత్మకతను సూచిస్తే, పుస్తకం మేధో జ్ఞానానికి సంకేతం. జపమాల ధ్యానాన్ని, ఏకాగ్రతను సూచిస్తుంది. ఈ మూడు అంశాలు కలిసినప్పుడే విద్య పరిపూర్ణమవుతుంది. ఆమె వాహనం హంస. ఇది విచక్షణా శక్తికి ప్రతీక. ఇది మంచి చెడులను వేరుచేసి, సరైన మార్గాన్ని ఎంచుకోవడాన్ని సూచిస్తుంది. ఈ రూపం సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దర్పణం.