News April 4, 2025
భద్రాద్రి బ్రహ్మోత్సవాల్లో గరుడ పట ఆవిష్కరణ

భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు గరుడ పట ఆవిష్కరణ జరిగింది. మంగళ వాయిద్యాల నడుమ రాజ వీధిలోని చిన్న జీయర్ మఠానికి చేరుకున్న ఆలయ వైదిక బృందం అక్కడ గరుడ పటలేఖనం, గరుడపట ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గరుడ పట ఆవిష్కరణ ఉత్సవంలో రామానుజ దేవనాథ జీయర్ స్వామి పాల్గొన్నారు.
Similar News
News July 7, 2025
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోండి: DEO

జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2025 సంవత్సరానికి అర్హులైన ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని మండల, ఉప విద్యాశాఖ అధికారి ద్వారా ఈనెల 13వ తేదీలోగా http//nation-alawardstoteachers.education.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News July 7, 2025
చేప పిల్లలు వద్దు.. నగదు ఇవ్వండి: మత్స్యకారులు

TG: ప్రభుత్వం ఏటా మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను అందిస్తోన్న సంగతి తెలిసిందే. వాటిని కాంట్రాక్టర్ల ద్వారా పంపిణీ చేయడం వద్దని, నేరుగా సహకార సంఘాలకు నగదు బదిలీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. నగదు ఇస్తే తామే నాణ్యమైన చేప పిల్లలను కొనుగోలు చేసుకుంటామన్నారు. కాంట్రాక్టర్లు సైజ్, నాణ్యతలో నిబంధనలు పాటించట్లేదని ఆరోపిస్తున్నారు. INC నేత జీవన్ రెడ్డి సైతం నగదు అంశంపై మంత్రి శ్రీహరికి లేఖ రాశారు.
News July 7, 2025
జూబ్లీహిల్స్ కోసం దండయాత్ర!

జూబ్లీహిల్స్ కోసం రాజకీయ పార్టీలే కాదు ఉద్యమకారులు దండయాత్రకు సిద్ధమయ్యారు. తమకు న్యాయం చేయకపోతే ఉప ఎన్నికలో పోటీ చేస్తామని INCని హెచ్చరించారు. ఓ వైపు TDP వ్యూహం రచిస్తోంది. తాను పోటీలో ఉంటానని యుగ తులసి పార్టీ అధ్యక్షుడు శివకుమార్ ప్రకటించారు. ఇక ఇండిపెండెంట్లు ఎంతమంది వస్తారో తెలియని పరిస్థితి. ప్రధాన పార్టీలైన INC, BRS, BJP గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డాల్సిన పరిస్థితి నెలకొంది.