News April 4, 2025

SRPT: తగ్గిన కోళ్ల ఉత్పత్తి.. పెరిగిన చికెన్ ధరలు

image

సూర్యాపేట జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బర్డ్ ఫ్లూ భయంతో రెండు నెలల క్రితం కేజీ రూ.150 నుంచి రూ.180 మధ్యే ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.250 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. బర్డ్ ఫ్లూ భయం తొలగడంతో పాటు రంజాన్ పండుగ నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ పెరగడం, వేసవి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తుంది.

Similar News

News November 8, 2025

MP సాన సతీశ్‌పై CM చంద్రబాబు ఆగ్రహం!

image

AP: గన్నవరం విమానాశ్రయంలో WC విన్నర్ శ్రీ చరణికి స్వాగతం పలికే విషయంలో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. విమానాశ్రయానికి మంత్రులు, శాప్, ACA ప్రతినిధులు వెళ్లారు. శ్రీ చరణి ఉన్న లాంజ్‌లోకి BCCI మాజీ చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్‌ని ప్రోటోకాల్ పోలీసులు వెళ్లనివ్వలేదు. దీనిపై MSKతో CM మాట్లాడారు. MP, ACA సెక్రటరీ సానా సతీశ్‌పై CM ఆగ్రహించినట్లు సమాచారం. ఇలాంటివి రిపీటవ్వకుండా చూసుకోవాలని ACAను ఆదేశించారు.

News November 8, 2025

నవంబర్ 8: చరిత్రలో ఈరోజు

image

1948: గాంధీని హత్య చేసినట్లు అంగీకరించిన గాడ్సే
2016: పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన కేంద్రం
1656: తోకచుక్కను కనుగొన్న సైంటిస్ట్ ఎడ్మండ్ హేలీ జననం
1927: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ జననం
1969: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జననం
1977: డైరెక్టర్ బీఎన్ రెడ్డి మరణం
2013: కమెడియన్ ఏవీఎస్ మరణం

News November 8, 2025

హోంగార్డుల సంక్షేమానికి కృషి: ఎస్పీ

image

హోంగార్డుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉంటామని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డులు పి. జాన్, సీహెచ్ భవానీలకు ‘చేయూత’ కింద రూ.6.55 లక్షల చెక్కులను ఎస్పీ అందజేశారు.