News April 4, 2025

వరంగల్: జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు తండ్రి, కొడుకు

image

ఒడిశా రాష్ట్రంలోని పూరీలో జరుగుతున్న 57వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలకు న్యాయ నిర్ణేతగా వరంగల్ జిల్లా గీసుగొండ మండలానికి చెందిన కోట రాంబాబు ఎంపికయ్యాడు. ఆయన కుమారుడు సృజన్ ఖోఖో జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. దీంతో వారిని గ్రామస్థులు అభినందించారు.

Similar News

News January 20, 2026

ఏలూరు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్

image

ఏలూరు జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టర్ సోమవారం మాట్లాడుతూ.. అభ్యర్థులకు ఏవైనా సమస్యలు ఉంటే నం.08812-230197కు ఫోన్ చేయాలని సూచించారు. ఆయా పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్, ఇంటర్‌నెట్ సెంటర్లను ఉదయం 8:30 గంటల నుంచి పరీక్ష పూర్తయ్యే వరకు క్లోజ్ చేయాలని అధికారులకు ఆదేశించారు.

News January 20, 2026

JN: వడ్డీ లేని రుణాల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలి: dy.cm

image

వడ్డీ లేని రుణాల పంపిణీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంత్రి సీతక్కతో కలిసి వీసీ ద్వారా కలెక్టర్లు, బ్యాంకు అధికారులతో రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా పాల్గొని జిల్లాలో జరుగుతున్న పురోగతిని వివరించారు. అర్హులైన మహిళా సంఘాలందరికీ సకాలంలో రుణాలు అందేలా చూడాలని డిప్యూటీ సీఎం సూచించారు.

News January 20, 2026

జనవరి 20: చరిత్రలో ఈరోజు

image

1900: సంస్కృతాంధ్ర పండితుడు పరవస్తు వెంకట రంగాచార్యులు మరణం
1907: ప్రముఖ రంగస్థల నటుడు బందా కనకలింగేశ్వరరావు జననం
1920: సినీ దర్శకుడు, ‘జానపద బ్రహ్మ’ బి.విఠలాచార్య జననం
1940: సినీనటుడు ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు జననం (ఫొటోలో)
1957: భారత్ తొలి అణు రియాక్టర్ ‘అప్సర'(ముంబై) ప్రారంభం