News April 4, 2025
సరికొత్త యుగానికి నాంది: ప్రధాని మోదీ

పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందడం చరిత్రాత్మకమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇది సరికొత్త యుగానికి నాంది అన్నారు. మద్దతు తెలిపిన ప్రజలు, చర్చల్లో పాల్గొన్న ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత లోపించిందన్నారు. ఇది ముస్లిం మహిళలు, పేదలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ఇకపై ఈ పరిస్థితి మారుతుందని స్పష్టం చేశారు. ప్రతి పౌరుడి గౌరవానికి ప్రాధాన్యమిస్తామని ఉద్ఘాటించారు.
Similar News
News April 9, 2025
కొనసాగుతున్న అల్పపీడనం

AP: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది. దీంతో ఈరోజు, రేపు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక 11న ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు ఏలూరులో 5 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో 2, గుంటూరులో 9, పల్నాడులో 2 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
News April 9, 2025
నేడు సీఎం చంద్రబాబు సొంతింటి శంకుస్థాపన

AP: CM చంద్రబాబు నేడు సొంతింటి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 8.51 గంటలకు ఆయన కుటుంబీకులతో కలిసి భూమిపూజలో పాల్గొననున్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వెనుక ఈ-9 రోడ్డులో 5.25 ఎకరాల్లో ఇంటి నిర్మాణం జరగనుంది. ఓ రైతు నుంచి ఆ భూమిని కొనుగోలు చేశారు. భూమి చదును పనులు నిన్నటికి పూర్తయ్యాయి. జీ ప్లస్ వన్‌గా ఇంటిని నిర్మిస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాదిలోపే గృహ ప్రవేశం చేసే అవకాశం ఉంది.
News April 9, 2025
జులై 24న విశ్వంభర రిలీజ్?

వశిష్ఠ డైరెక్షన్‌లో చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ థ్రిల్లర్ విశ్వంభర మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. VFX పనులను త్వరగా పూర్తి చేసి జులై 24న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. 2002లో ఇంద్ర సినిమా ఇదే తేదీన రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను ఫాలో కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12న ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి.