News April 4, 2025
GNT: అభిరామ్‌కు సీఎం చంద్రబాబు అభినందన

సీఎం చంద్రబాబును గుంటూరుకు చెందిన మ్యాగ్నమ్ వింగ్స్ సీఈఓ అభిరామ్ చావా కలిశారు. ఇటీవల తాను తయారుచేసిన ఎయిర్ ట్యాక్సీ గురించి సచివాలయంలో సీఎంను కలిసి వివరించారు. ఈ సందర్భంగా అభిరామ్‌ను సీఎం అభినందించారు. ఎయిర్ ట్యాక్సీ వివరాలు, సెక్యూరిటీ ఫీచర్స్, తయారీకి అయిన ఖర్చు వంటి వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రెండు సీట్ల సామర్థ్యంతో ఈ ఎయిర్ ట్యాక్సీని తయారు చేశానని అభిరామ్ అన్నారు.
Similar News
News April 9, 2025
రీసర్వే డేటాను వేగంగా నమోదు చేయండి: భార్గవ్ తేజ

గుంటూరు జిల్లాలో భూముల రీసర్వే పూర్తైన 14 గ్రామాల వివరాలను ఆన్‌లైన్‌లో సరైన విధంగా నమోదు చేయాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రీ సర్వేలో సేకరించిన డేటా తప్పులు లేకుండా నమోదు కావాలని, ఇది భవిష్యత్తులో భూ వివాదాలను నివారించే దిశగా కీలకంగా పనిచేస్తుందన్నారు. గ్రౌండ్ ట్రూ థింగ్ ప్రక్రియను నిర్లక్ష్యం చేయవద్దన్నారు.
News April 9, 2025
నిడుబ్రోలు: భార్య మృతి తట్టుకోలేక గుండెపోటుతో భర్త మృతి

నిడుబ్రోలులో విషాదం చోటుచేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక గుండెపోటుతో భర్త మరణించిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. మాజీ ఆర్మీ ఉద్యోగి ఆశీర్వాదం(85), భార్య సామ్రాజ్యం(76) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడేవారు. సోమవారం రాత్రి సామ్రాజ్యం మృతిచెందగా, ఆమె మరణాన్ని తట్టుకోలేక ఆశీర్వాదం మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఇప్పటికే వీరు ఇద్దరు కుమారులను రోడ్డు ప్రమాదాల్లో కోల్పోయారు.
News April 9, 2025
గుంటూరు: భార్య కోసం భర్త ఆత్మహత్య

భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగళరావు నగర్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఛార్లెస్ (52) ప్రతిరోజూ ఇంటికి మద్యం తాగి వస్తుండటంతో కుటుంబంలో గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఛార్లెస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.