News April 4, 2025
SRH బౌలింగ్ బాగానే ఉంది: కమిన్స్

KKRతో మ్యాచ్ ఓడిపోవడంపై SRH కెప్టెన్ కమిన్స్ స్పందించారు. బౌలింగ్ బాగానే ఉందని, కీలక సమయాల్లో క్యాచ్‌లు వదిలేయడం వల్లే ఓడాల్సి వచ్చిందన్నారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా లేదని భావించి జంపాను ఆడించలేదని తెలిపారు. స్పిన్నర్లు బంతిని సరిగా గ్రిప్ చేయలేకపోయారని, అందుకే వాళ్లతో 3 ఓవర్లే వేయించినట్లు వివరించారు. మరోవైపు, స్పిన్నర్లను సరిగా ఉపయోగించకపోవడం వల్లే మ్యాచ్ ఓడిపోయిందని విమర్శలు వస్తున్నాయి.
Similar News
News April 5, 2025
నేడు IPLలో డబుల్ ధమాకా

ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై వేదికగా సీఎస్కే-డీసీ తలపడనున్నాయి. ఈ మ్యాచుకు రుతురాజ్ గైర్హాజరీలో సీఎస్కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ వ్యవహరించే ఛాన్స్ ఉంది. మరోవైపు రాత్రి 7.30 గంటలకు పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ ఢీకొననున్నాయి. వరుస విజయాలతో పంజాబ్ జోరు మీద ఉండగా, వరుస ఓటములతో రాజస్థాన్ డీలా పడింది. మరి ఇవాళ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News April 5, 2025
వక్ఫ్ బిల్లు ఆమోదం చరిత్రాత్మకం: పవన్

AP: వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం చరిత్రాత్మకమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ బిల్లుతో దేశంలోని పేద ముస్లింలకు న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ప్రధాని మోదీ నాయకత్వంలో దీర్ఘకాల సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతోంది. ప్రతిపక్షాల అభిప్రాయాలను గౌరవిస్తూనే సభలో చర్చ జరిపిన తీరు అందరికీ ఆదర్శం. ఈ బిల్లు ఆమోదంతో ముస్లింల హక్కులకు భద్రత లభించినట్లే’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News April 5, 2025
నేడు ముప్పాళ్లకు సీఎం చంద్రబాబు

AP: CM చంద్రబాబు ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. నందిగామ నియోజకవర్గం చందర్లపాడు(M) ముప్పాళ్లలో జరిగే బాబు జగ్జీవన్‌రామ్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో CM మాట్లాడతారు. ఆ తర్వాత పార్టీ శ్రేణులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.