News March 26, 2024

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు – జిల్లా ఎస్పీ

image

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డాక్టర్ కే తిరుమలేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఉదయగిరి పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 18 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామన్నారు. దీంతోపాటు 26 ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు ఏర్పాటు చేసి ఇప్పటికే తనిఖీలు చేపట్టామన్నారు.

Similar News

News November 4, 2025

నెల్లూరు: సగం బిల్లే ఇచ్చారని TDP నాయకుడి ఆవేదన

image

గుడ్లూరు(M) చినలాటరపికి చెందిన TDP నాయకుడు మల్లికార్జున ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం హల్‌చల్ చేశారు. 2014-19 మధ్య చేసిన పనులకు రూ.10 లక్షల బిల్లులు ఆగిపోయాయని, తాజాగా రూ.3.5 లక్షలే విడుదల చేశారని చెప్పారు. మిగిలినవి ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాధాన్యక్రమంలో బిల్లులు చెల్లిస్తామని MPDO తెలిపారు.

News November 4, 2025

నెల్లూరు: బీటెక్ చదివి దొంగతనాలు

image

నెల్లూరులో నిన్న ఓ <<18189275>>దొంగ పట్టుబడిన <<>>విషయం తెలిసిందే. అల్లూరు(M) జమ్మిపాలేనికి చెందిన శ్రీనాథ్ 2009లో బీటెక్(సివిల్) పూర్తి చేశాడు. ప్రస్తుతం నెల్లూరులోని ఓ థియేటర్‌లో పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్ క్యాసినో ఆడుతూ జీతం మొత్తం దానికే పెడుతున్నాడు. ఈజీ మనీకి అలవాటు పడి చైన్ స్నాచింగ్, బైకుల దొంగతనాలు మొదలు పెట్టాడు. గతనెల 23న చాకలి వీధిలో జరిగిన కేసులో దొరకగా.. 7బైకులు, రెండు చైన్లు రికవరీ చేశారు.

News November 4, 2025

నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకు మాజీ మంత్రి జోగి

image

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌తో పాటు అతని సోదరుడు జోగి రాములను నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకి తరలించారు. విజయవాడ జైల్లో ఉన్న వారిద్దరిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తీసుకురాగా.. జైలు వద్ద మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా జోగి రమేష్‌ని కాకాని గోవర్ధన్ రెడ్డి ఆలింగనం చేసుకున్నారు.